Palnadu: పదో తరగతిలో ప్రతిభ చాటిన అమూల్యకు ఎకరం పొలం

Read Time:  1 min
Palnadu: పదో తరగతిలో ప్రతిభ చాటిన అమూల్యకు ఎకరం పొలం
FONT SIZE
GET APP

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన అమూల్య అనే పది తరగతి విద్యార్థిని తన ప్రతిభతో ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె అత్యుత్తమంగా – మొత్తం 600 మార్కుల్లో 593 మార్కులు సాధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. గ్రామీణ ప్రాంతంలో, తీవ్ర ఆర్థిక కష్టాల్లోనూ, సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.

ప్రతిభను గుర్తించిన కలెక్టర్

అమూల్య విజయవార్త తెలుసుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు IAS గారు ఆమెను వ్యక్తిగతంగా అభినందించారు. ఆమె కుటుంబ స్థితిగతులను వివరంగా తెలుసుకున్న ఆయన, అమూల్య తల్లిదండ్రులు అనిల్, రూతమ్మలు రోజువారీ కూలి పనులతో జీవనం సాగిస్తుండగా, ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత శిక్షణ సదుపాయాల లేని పరిస్థితుల్లో కూడా కుమార్తె చదువులో రాణించిందని తెలుసుకుని ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అమూల్య తల్లిదండ్రులు అనిల్, రూతమ్మలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో మరో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

భూమి లేని నిరుపేదల పథకం కింద ఎకరం భూమి మంజూరు

అమూల్య కుటుంబానికి భూమి లేదన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ గారు భూమి లేని నిరుపేదల పథకం కింద ఎకరం పొలం మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది ఆ కుటుంబానికి ఊహించని వరం. కేవలం విద్యను ప్రోత్సహించడమే కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న గొప్పతనం. కలెక్టర్ ప్రకటనపై అనిల్, రూతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే భూమిని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తామని వారు తెలిపారు.

Read also: Adinarayana Reddy: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.