శ్రీ చైతన్య కాలేజీ హాస్టల్ మూసేయాలని ఆదేశం

హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ పై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై మండిపడింది. ఈ హాస్టల్ తక్షణమే మూసివేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సిఫార్సు చేసింది. కాగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద కాలేజీని సందర్శించిన 24 గంటల్లోనే బాలల హక్కుల కమిషన్ చర్యలు తీసుకోవడం గమనార్హం.

గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో విద్యార్థినులకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి రావడంతో…మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారద మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థినుల హాస్టళ్లు, మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్, హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించారు. వసతులు సరిగ్గా లేవని కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడివారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీచైతన్య యాజమాన్యానికి సమన్లు పంపారు. పిల్లల భద్రత పై రాజీపడే ఎవ్వర్ని ఉపేక్షించేది లేదని సందర్భంగా తెలియచేశారు.

భవనం పై నుంచి లీకేజీ నీరు భోజనంలో పడిందని చెప్తే ఏమీ కాదు తినండని విద్యార్థినులకు ఉచిత సలహా ఇస్తారా? ఇరుకు గదుల్లో ఎలాంటి వెంటిలేషన్‌ లేదు, వాష్‌ రూమ్స్‌ కూడా సరిగా లేవు, చెత్తా చెదారం పేరుకుపోయిన చోటే విద్యార్థినులకు భోజనం పెడుతున్నారా అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.