శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి కోటా దర్శనం టికెట్లు విడుదల తేదీలు ఇవే

tirumala darshan tickets

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2025 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అక్టోబర్ 21న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో భక్తులు టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు లక్కీ డిప్‌లో విజేతలు అక్టోబర్ 21 నుండి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్లను పొందేందుకు చెల్లింపులు పూర్తి చేయవలసి ఉంటుంది.

అక్టోబర్ 22: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్ల కోటాను కూడా విడుదల చేస్తారు.

అక్టోబర్ 23: అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం 10 గంటలకు మరియు శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటా ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు వృద్ధులు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటుందిఅక్టోబర్ 24: ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతి గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. భక్తులు ఈ సేవలు మరియు దర్శనం టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Abu obeida, a spokesperson fоr hаmаѕ’ѕ armed wіng, ѕаіd in a ѕреесh оn thе аnnіvеrѕаrу оf thе 7 october аttасk thаt thе. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.