ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించిన కొత్త పాలసీలపై చర్చించబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల హామీలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా, మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మంజూరు చేయడం గురించి చర్చ జరుగుతుంది.అలాగే, పర్యావరణ రక్షణలో భాగంగా చెత్త పన్ను రద్దు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూలింగ్ మరియు స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కూడా చర్చ జరుగుతుంది. 13 కొత్త మున్సిపాలిటీలలో 190 పోస్టుల భర్తీని కేబినెట్ పరిశీలించనుంది.ఈ కేబినెట్ సమావేశంలో పారిశ్రామిక రంగానికి సంబంధించిన 5 నుంచి 6 కొత్త పాలసీలను కూడా కేబినెట్ ముందు ఉంచాలని ప్రణాళిక ఉంది, ఇవి రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించగలవని భావిస్తున్నారుఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు ఇతర కూటమి మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రజలకు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.