हिन्दी | Epaper
విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

Odela 2 Movie: ఓదెల 2 మూవీ రివ్యూ

Anusha
Odela 2 Movie: ఓదెల 2 మూవీ రివ్యూ

తమన్నా నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలలోను గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన ‘అరణ్మనై 4’ సినిమాలోనూ దెయ్యంగా  ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆటకట్టించే మాంత్రికురాలుగా కనిపించనుంది. తమన్నా మాంత్రికురాలిగా కనిపించే సినిమా ‘ఓదెలా 2’.అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ‘ఓదెలా రైల్వేస్టేషన్’ 2022లో థియేటర్స్ లోకి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా పలకరిస్తే, ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ గా అలరించనుంది. సంపత్ నంది కథ – స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది.ఈరోజు థియేటర్ లో విడుదలైంది ఓదెల 2 మూవీ ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.

కథ

ఓదెలలో తిరుపతి (వశిష్ట ఎన్ సింహా)ను అతడి భార్య రాధ (హెబ్బా పటేల్) చంపేసిన తర్వాత ఊరు అంతా పండగ చేసుకుంటుంది.  రాధ జైలుకు వెళ్లింది. తిరుపతి శవానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. బాడీని ఇంట్లోవారికి అందజేశారు. తిరుపతి శవాన్ని ఊళ్లోకి తీసుకొచ్చారు. ఊళ్లోజనం ఉసురు పోసుకున్నాడన్న కసితో ఊళ్లోవారెవరూ తిరుపతి శవాన్ని చూడ్డానికి కూడా రాలేదు. సరికదా అతని ఆత్మని కూడా శిక్షించాలని నిర్ణయించుకుంటారు. ఊరి పూజారి సలహా మేరకు అతని శవాన్ని నిలువనా నిలబెట్టి, అతని శరీరాన్ని కోడి నెత్తురుతో తడిపి, ఊళ్లో జనం గోళ్లు మూటగట్టి ఆ మూటతో సహా అతన్ని పాతిపెడతారు. అలా నిలువునా పాతిపెడితే అతని ఆత్మకు శాంతి క్షోభకు గురి అవుతుందని వారి నమ్మకం. ఊరి జనం చేసిన పనివల్ల తిరుపతి ఆత్మ నిజంగానే క్షోభ చెందుతుంది. ఆ బాధ కాస్తా పగగా మారుతుంది. తను దెయ్యంగా మారతాడు. ఊర్లో కొత్తగా పెళ్లయిన జంటల్నీ టార్గెట్‌ చేసి, భయంకరంగా చంపతుంటాడు. వేరేవాళ్ల శరీరాల్లోకి ప్రవేశించి వారి ద్వారా తన పనిని పూర్తి చేస్తుంటాడు. ఈ చర్యలవల్ల అమాయకులు బలైపోతుంటారు. అలాంటి సమయంలో తరుణోపాయం కోసం ఊరిజనం జైల్లో ఉన్న రాధను కలుస్తారు. ‘వాడ్ని చంపింది నువ్వే. ఇప్పుడు కాపాడాల్సింది నువ్వే’ అని ప్రాధేయపడటంతో రాధ తన అక్క భైరవి(తమన్నా) గురించి ఊరు జనాలకు చెబుతుంది. ఈ దెయ్యం ఆటకట్టించే శక్తి భైరవికి మాత్రమే ఉందని రాధ ఊరి జనాలకు చెప్పడంతో ఊరిజనం భైరవిని వెతికే ప్రయత్నాలు మొదలుపెడతారు. తన జీవితాన్ని శివుడికే అంకితం చేసిన నాగసాధు భైరవి. మరి భైరవిని ఊరుజనం ఎలా చేరారు? ఊరికి పట్టిన పీడను భైరవి ఎలా వదిలించింది? ఈ క్రమంలో క్షుద్రశక్తితో భైరవి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.

  Odela 2 Movie: ఓదెల 2 మూవీ రివ్యూ

కథనం

ఈ సినిమా కథ విషయానికొస్తే ఇందులో కొత్తదనం ఏమాత్రం లేదు. రచయిత, దర్శకత్వపర్యవేక్షకుడైన సంపత్‌నంది చెప్పినట్టు ‘ఆత్మ వర్సెస్‌ పరమాత్మ’ అంతే ఈ సినిమా. ఈ పాయింట్‌తో తెలుగుతెరపై లెక్కకు మించిన కథలొచ్చాయి. విజయాలను కూడా అందుకున్నాయి. ఇలాంటి సినిమాల్లో క్లెమాక్స్‌ ఏంటో ఆడియన్స్‌కి తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని కొత్తగా చూపిస్తే సినిమా గట్టెక్కినట్టే. ఈ విషయంలో దర్శకుడు అశోక్‌తేజా కొంతమేర సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ షాట్‌ నుంచే కథపై ఆసక్తిని కలిగించాడు. ప్రధమార్ధం అంతా ‘అరుంధతి’ సినిమాను గుర్తు చేస్తుంది. అందులో పశుపతిని అరుంధతి సమాధి చేసినట్టుగానే ఇందులో తిరుపతిని ఊరిజనం సమాధి చేస్తారు. అందులో పశుపతి ఉగ్రభూతంగా మారినట్టుగానే ఇందులోనూ తిరుపతి దెయ్యంగా మారతాడు. అందులో షయాజీ షిండే పాత్రను గుర్తు చేసేలా ఇందులో మురళీశర్మ పాత్ర కనిపించింది. భైరవి పాత్ర ఎంటరైనప్పట్నుంచీ కథ మరోమలుపు తీసుకుంది. అక్కడ్నుంచీ తిరుపతి ఆత్మ, భైరవి మధ్య జరిగే సంఘటనలు ఆడియన్స్‌కి గూజ్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ఓ దశలో తిరుపతి ఆత్మను భైరవి ప్రతిఘటించలేని పరిస్థితి రావడం, తిరుపతి ఆత్మ ఇవన్నీ ఉత్కంఠకు గురిచేస్తాయి. 

Read Also: Nazriya Nazim: రియాక్ట్ అవ్వకపోవడంతో చాలా రిగ్రేట్ ఫీల్ అయ్యా: నజ్రియా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870