Notices issued to Tiruvuru MLA.

తిరువూరు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ..!

అమరావతి: టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నారు ఇటీవల ఓ గ్రామంలో సిమెంట్ రోడ్ వివాదంలో ఆయన జోక్యం చేసుకోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వివాదంతో పాటు ఆయన పార్టీకి నష్టం చేసేలా పలు రకాల ప్రకటనలు,చర్యలు చేపడుతున్నారు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాలని ఆయనకు టీడీపీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Advertisements

కొలికపూడి శ్రీనివాసరావు గతంలో అమరావతి ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఈ కారణంగా ఆయనకు టీడీపీ నుంచి కృష్ణా జిల్లా తిరువూరు టిక్కెట్ ను చంద్రబాబు కేటాయించారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న తిరువూరు నియోజకవర్గంలో ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. అయిత ఆయన వివాదాలతో వరుసగా టీడీపీకి తలనొప్పులు తీసుకు వస్తున్నారు. ప్రతిపక్ష నేత తరహాలో ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకకు ప్రయత్నించారని అధికారులల్ని బెదిరించడంతో పాటు టీడీపీ క్యాడర్ తోనూ ఆయన గొడవలు పడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి.

image
image

ఓ సారి ఓ మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన తాను తప్పులు దిద్దుకుంటానని తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగాయని వివరణ ఇచ్చారు. దాంతో రెండు నెలల పాటు ఆయనను నియోజకవర్గానికి దూరంగా ఉండాలని సూచించారు. తర్వాత మళ్లీ వివాదాలు ప్రారంభించడంతో హైకమాండ్ అసంతృప్తికి గురయింది. ఆయనపై కఠిన చర్యలుతీసుకోవాలని నిర్ణయించిననట్లుగా తెలుస్తోంది. ఆయన తీరుతో పార్టీ నష్టపోతోందని తిరువూరు టీడీపీ క్యాడర్ పదే పదే ఫిర్యాదులు చేస్తోంది.

సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్ ను నిర్వహించే కొలికపూడి .. రాజకీయాలను డీల్ చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పాఠాల్లో ఉండే రాజకీయాలు వేరని.. అలాగే ఎమ్మెల్యేగా చేసే రాజకీయాలు వేరని.. ఆ రెండింటి మధ్య తేడా ఆయన చూపించలేక వివాదాల్లలో ఇరుక్కుపోతున్నారని భావిస్తున్నారు. ఆయన పార్టీ కోసం పని చేయకుండా నేరుగా ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకుని గెలిచేశారని దాని వల్ల క్యాడర్ ను ఆయన పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Related Posts
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!
Vistaras Delhi London flig

గత కొద్దీ రోజులుగా వరుసగా విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు పాలనా విమాననానికి బాంబ్ పెట్టినట్లు మెసేజ్ లు Read more

మావోయిస్టుల బంద్‌తో ములుగులో హై అలర్ట్
mulugu maoist bandh

మావోయిస్టులు సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల ఉద్యమం ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి Read more

నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు..!
CM Chandrababu visit to Annamayya district today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాకు రానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ Read more

FASTag : నేటి నుంచి కొత్త రూల్స్.. లేటైతే రెట్టింపు బాదుడు
FASTag new rules from today

మీ ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి..లేదంటే ఇబ్బందులు న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు మార్చింది. ముఖ్యంగా బ్లాక్ Read more