हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Actor: లైఫ్ పార్టనర్ గురించి ఆలోచించడం లేదు: విజయ్ దేవరకొండ

Anusha
Actor: లైఫ్ పార్టనర్ గురించి ఆలోచించడం లేదు: విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘పెళ్ళి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారనే సంగతి తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన హార్డ్ వర్క్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలతోనే కాకుండా, రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనూ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ ‘కింగ్డమ్’ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా ‘ఫిలింఫేర్’ మ్యాగజైన్ కవర్ పేజీ(Magazine cover page)కి ఎక్కారు.విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) స్టైలిష్ ఫొటోతో ప్రముఖ మూవీ మ్యాగజైన్ ఫిలింఫేర్ మే నెల కవర్ పేజీని పబ్లిష్ చేసింది. ‘విక్టరీ మార్చ్’ అనే టైటిల్ తో వచ్చిన ఈ నెల మ్యాగజైన్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా దాకా విజయ్ ఎదిగిన తీరును విశ్లేషించారు. కవర్ పేజీపై రౌడీ బాయ్ ఒక చెక్క కుర్చీలో స్టైల్ గా కాలు మీద కాలేసుకుని ఠీవిగా కూర్చొని ఉన్నారు. బ్లాక్ కలర్ జాకెట్, దానికి మ్యాచ్ అయ్యే షూస్ ధరించి ఇంటెన్స్ గా చూస్తున్నారు. దీంతో పాటుగా ఫిలింఫేర్ కోసం మరికొన్ని ఫోటోలకు విజయ్ పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

నటించాలని

ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. హీరోయిన్ రష్మిక మందన్నతో విజయ్ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక గురించి అడగ్గా ఆమెతో ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించాలని ఉందని చెప్పాడు. రష్మిక(Rashmika Mandanna) ఎంతో మంచి వ్యక్తి అని, అందమైన నటి అని పేర్కొన్నారు. పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ లైఫ్ పార్టనర్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటానని అన్నారు. మీ లైఫ్ పార్టనర్ కి ఉండాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా? అని ప్రశ్నించగా మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా ఫర్వాలేదని విజయ్ బదులిచ్చారు.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారింది. ఈ మూవీ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, తనను మార్చేసిందని విజయ్ అన్నారు. పూరీ జగన్నాథ్‌(Puri Jagannath) అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలనుకునేవాడినని, ‘లైగర్‌’తో ఆ కల నెరవేరిందని చెప్పారు. స్టోరీ విన్నప్పుడు అద్భుతంగా అనిపించిందని, కానీ ఆశించిన ఫలితం దక్కలేదన్నారు. పూరీ కాంబోలో హిట్‌ రాలేదనే బాధ ఉందన్నారు.

Read Also : Actress: ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో సర్వసం కోల్పోయినట్టు అనిపించింది: ప్రీతి జింటా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870