NIA collecting voice samples of Tahawwur Rana

NIA : తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్న ఎన్ఐఏ

NIA : ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్నాడు. ముంబై దాడులకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఐఏ, అతడి వాయిస్ శాంపిల్‌ను సేకరించే చర్యలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో 166 మంది ప్రాణాలను బలిగొన్న దాడులకు సంబంధించి ఆ సమయంలో ఇతరులకు తహవూర్ రాణా సూచనలు ఇస్తున్నట్టు అనుమానిస్తున్న కాల్ రికార్డులతో వాయిస్ శాంపిల్‌ను సరిపోల్చి చూడనున్నారు. అయితే, ఈ ప్రక్రియ కోసం వాయిస్ శాంపిల్‌ సేకరించాలంటే నిందితుడి అనుమతి కూడా ఉండాలి. అతను వద్దనుకుంటే అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి తర్వాతే అతడి వాయిస్‌ను రికార్డు చేస్తారు. వాయిస్ శాంపిల్‌కు అతడు నిరాకరిస్తే విచారణ దశలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.

Advertisements
 తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్

రాణాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు

కాగా, ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో రాణాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు ముంబై ముట్టడి ప్రారంభం కావడానికి ముందు అతడు దుబాయ్‌లో కలిసిన వ్యక్తి పాత్రను, అతడి ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీగా నమోదైన ముంబైలోని ఆఫీసు లీజును పునరుద్ధరించకపోవడం గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఆఫీసుని 26/11 దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ నగరంలోని కీలకమైన హోటళ్లు, పబ్లిక్ సైట్‌లతో సహా అనుకున్న లక్ష్య ప్రదేశాలపై నిఘా ఉంచడానికి ఒక కవర్‌గా ఉపయోగించినట్లు సమాచారం. అలాగే, ముంబై దాడులకు ప్రధాన కుట్రదారులు సాజిద్ మజీద్, జకీర్ రెహమాన్ లఖ్వి, అబుద్ల్ రెహమాన్, ఇలియాస్‌ల గురించి అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలిరోజు విచారణలో తనకేమీ గుర్తులేదని, దాడులు జరిగేందుకు వారం ముందు మాత్రమే వచ్చినట్టు నిందితుడు చెప్పాడని సమాచారం.

Related Posts
Rahul Gandhi : సావర్కర్‌పై రాహుల్ గంధీ వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం
Rahul Gandhi comments on Savarkar... Supreme Court agreed

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వీర్‌ సావర్కర్‌కు మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ Read more

IPL 2025: రోహిత్ సిక్సర్ తో బాదుడు..
రోహిత్ సిక్సర్ తో బాదుడు..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ఎట్టకేలకు బోణి కొట్టింది. కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై Read more

సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Justice Sanjiv Khanna as the next senior judge of the Supreme Court

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును..ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సిఫార్సు చేశారు. దీంతో తదుపరి సీజేగా Read more

మహారాష్ట్రలో త్వరలో మత మార్పిడుల నిరోధక చట్టం
nitesh rana

మహారాష్ట్రలో మత మార్పిడులను నిరోధించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ వర్గాల మధ్య చిచ్చు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×