ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Congress party) నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా(Former Minister RK Roja) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలకు అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

మెడికల్ కాలేజీలపై రోజా ఆరోపణలు
ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేస్తున్న ప్రచారంపై రోజా మండిపడ్డారు. మంత్రులు చూపిస్తున్న వీడియోలు నిజమైనవి కావని, అవన్నీ ఫేక్ అని ఆరోపించారు. హోంమంత్రి అనిత మెడికల్ కాలేజీలపై(Medical Colleges) చూపించింది ప్రజెంటేషన్ కాదని, అది ఆమె ఫ్రస్ట్రేషన్ అని ఎద్దేవా చేశారు. “చంద్రబాబు(Chandrababu) ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారికి దమ్ముంటే నాతో పాటు వస్తే నిజమైన మెడికల్ కాలేజీలను చూపిస్తాను” అని సవాల్ విసిరారు. చంద్రబాబు తన సుదీర్ఘ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని ఆమె గుర్తుచేశారు.
పవన్ కల్యాణ్, కూటమిపై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై(Chief Minister Pawan Kalyan) రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తారని ఓట్లు వేస్తే, పవన్ మాత్రం సినిమా షూటింగులు చేసుకుంటూ, ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా, ప్యాకేజీల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. “ఆయనకు ఓటు వేసినందుకు ప్రజలు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు” అని అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ మెప్పు పొందడం కోసమే మంత్రులు సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. జగన్ బెంగళూరులో ఉన్నారని విమర్శిస్తున్న టీడీపీ, జనసేన నేతలు, గతంలో తాము ఓడిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
వైసీపీ నేత రోజా కూటమి ప్రభుత్వంపై చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేయలేదని ఆమె ఆరోపించారు.
రోజా మెడికల్ కాలేజీల గురించి ఏమని విమర్శించారు?
మంత్రులు ఫేక్ వీడియోలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, చంద్రబాబు తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: