हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

ప్రేమ కోసం జైలు పాలు అయిన ప్రేమికుడు

Vanipushpa
ప్రేమ కోసం జైలు పాలు అయిన ప్రేమికుడు

ప్రేమకు సరిహద్దులు వుండవని అంటారు. దేశం, కులం, మతం వీటికి అతీతమైనదే ప్రేమ. దీనిని నిరూపించాలి అనుకున్నాడు ఓ ప్రేమికుడు. ఆ ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు ఓ ప్రేమికుడు. ప్రియురాలి కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటి పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్‌కు చెందిన 30 ఏళ్ల యువకుడు బాదల్ బాబుకు పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ప్రియురాలిని కలుసుకునేందుకు బాదల్ బాబు ఇండియా – పాక్ సరిహద్దును దాటి ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. దీంతో అక్కడి పోలీసులు మండి బహుద్దీన్ పట్టణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

jail


14 రోజుల కస్టడీ
అక్కడి చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. ఈ ఘటన డిసెంబర్ 27న జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాదల్ బాబు అక్రమ ప్రవేశంపై పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదల్ బాబు పాక్ రావడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా ? లేక దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

అయితే బాదల్ బాబు పాక్ వెళ్లేందుకు ప్రయత్నించడం ఇది తొలి సారి కాదు. గతంలో రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మూడో సారి విజయవంతంగా ప్రియురాలి వద్దకు చేరుకున్నప్పటికీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870