📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

RBI: 10ఏళ్ళు దాటితే చాలు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు

Author Icon By Vanipushpa
Updated: April 22, 2025 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోని అన్ని బ్యాంకులకు ఒక ముఖ్యమైన ఆర్డర్ జారీ చేసింది, దింతో ఇప్పుడు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఓపెన్ చేయవచ్చు అలాగే అతను/ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి (guardian) సహాయం లేకుండానే అకౌంట్ స్వయంగా మెయింటేన్ చేయవచ్చు. ఇంతకుముందు పిల్లలకి ఇలాంటి అకౌంట్ తెరవడానికి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు అవసరం, కానీ ఇప్పుడు 10 సంవత్సరాల వయస్సు తర్వాత సొంతంగా బ్యాంకుల్లో అకౌంట్ ఇంకా ఎఫ్దిలు తీసుకోవచ్చు.

10ఏళ్ళు దాటితే అకౌంట్ తెరవవచ్చు
దీనికి సంబంధించి సోమవారం అన్ని వాణిజ్య బ్యాంకులు అలాగే సహకార బ్యాంకులకు ఒక సర్క్యులర్ జారీ చేయడం ద్వారా ఆర్‌బిఐ ఈ సమాచారాన్ని అందించింది. ఏ వయసు వారైనా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా అకౌంట్ తెరవవచ్చని, కానీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే వాళ్లే స్వయంగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చని అందులో పేర్కొంది. అంతేకాదు అతను/ఆమె తల్లిని సంరక్షకురాలిగా చేయడం ద్వారా కూడా అకౌంట్ తెరవవచ్చు.
కొత్త రూల్ హైలెట్స్ ఇవే
*పిల్లల వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అతను/ఆమె సొంతంగా సేవింగ్స్ ఇంకా టర్మ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, నిర్వహించవచ్చు. *అలాగే పిల్లలు ఎంత డబ్బు జమ చేయాలో, ఎంత వరకు విత్ డ్రా చేసుకోవచ్చో బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇదంతా బ్యాంకు రిస్క్ మేనేజ్‌మెంట్ విధానంపై ఆధారపడి ఉంటుంది. *ఈ మైనర్లకు 18 సంవత్సరాలు నిండిన తరువాత బ్యాంకు మళ్ళీ అతను/ఆమె నుండి కొత్తగా సంతకం అండ్ అకౌంట్ మెయింటెనెన్స్ పద్ధతిని తీసుకుంటుంది. *పిల్లలకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM/డెబిట్ కార్డ్, చెక్ బుక్ వంటి సౌకర్యాలు ఇవ్వాలా వద్దా అనేది బ్యాంకులు సొంతంగా నిర్ణయించుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు
ఇటువంటి అకౌంట్ నుండి ఎక్కువగా డబ్బు విత్ డ్రా చేసుకోకూడదు అలాగే ఎల్లప్పుడూ కొంత బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తుండాలి. ఇంకా కస్టమర్ KYC (know your customer) అంటే గుర్తింపు సరిగ్గా ఉందో లేదో చెక్ చేయబడుతుంది ఇంకా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడుతుంది.1 జూలై 2025 నాటికి ఈ కొత్త నిబంధనల ప్రకారం పాలసీలను సిద్ధం చేసుకోవాలని లేదా ఉన్న నిబంధనలను మార్చాలని RBI అన్ని బ్యాంకులను కోరింది. అయితే పిల్లల అకౌంట్లో ఓవర్‌డ్రాఫ్ట్ ఎప్పటికీ అనుమతించకూడదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది; అంటే అకౌంట్లో ఎల్లప్పుడూ బ్యాలెన్స్‌లో ఉండాలి, లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉండదు.

Read Also: JD Vance: జైపూర్‌లో జేడీ వాన్స్ కి ఘన స్వాగతం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today You can open a savings account

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.