📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హీరో విజయ్ దళపతికి వై+ భద్రత

Author Icon By Vanipushpa
Updated: February 14, 2025 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడుకు చెందిన ప్రముఖు నటుడు, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ దళపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వై ప్లస్ భద్రతను కల్పించబోతున్నట్లు వివరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను కూడా జారీ చేయగా.. అంతా షాక్ అవుతున్నారు. తమిళనాడులో ఎన్నికలు ఏడాది తర్వాత ఉండగా.. ఇప్పుడే ఆయనకు భద్రత ఎందుకు కల్పిస్తుందని ఆలోచిస్తున్నారు. విజయ్ దళపతికి కేంద్ర హోంశాఖ వై ప్లస్ భద్రత కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 11 మంది సాయుధ గార్డులు షిఫ్టుల వారీగా 24 గంటల పాటు హీరోకు భద్రత కల్పించబోతున్నారు.

ముప్పు కారణంతోనే భద్రత

అసలు హీరోకు భద్రత కల్పించడానికి ప్రధాన కారణం ముప్పు పొంచి ఉండడమే. ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో పాటు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే ఆయనకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర హోంశాఖ వై ప్లస్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ భద్రత అంటే నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల పాటు భద్రత కల్పిస్తారు. వీరిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు ఉండగా.. 7 నుంచి 9 మంది పోలీసులు ఉంటారు. అలాగే కాన్యాయ్‌లో ఒకటి లేదా రెండు వాహనాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పద్ధతిలోనే హీరో విజయ్ దళపతికి భద్రత కల్పించింది సర్కారు.

సర్కారు ముందస్తు జాగ్రత్తగా..
తమిళ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి 2024లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా అదే ఏడాది తమిళ వెట్రి కజగం అనే పార్టీని కూడా స్థాపించారు. 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని వెల్లడించారు. ఈక్రమంలోనే కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం రోజు ఎన్నికల వ్యాహకర్త, జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశం అయ్యారు. అనేక విషయాలపై చర్చించుకున్న తర్వాత.. విజయ్ దళపతికి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా టీవీకే పార్టీకి ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే సర్కారు ముందస్తు జాగ్రత్తగా ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hero Vijay Dalapathy Latest News in Telugu Paper Telugu News tamil actor Telugu News online Telugu News Paper Telugu News Today Today news Y+ security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.