కర్ణాటక,కల్యాణ రాజ్య ప్రగతి పక్ష శాసన సభ్యుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి(Gaali Janardhana Reddy) మరో బిగ్ షాక్ తగిలింది. ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఏడు సంవత్సరాల కారాగార శిక్ష పడిన ఆయనపై కర్ణాటక అసెంబ్లీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాల వ్యవహారంలో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్ధన్ రెడ్డికి ఏడు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసును ఎదుర్కొన్న తెలంగాణకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీకి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మీని నిర్దోషులుగా తేల్చింది. వారిపై సీబీఐ నమోదు చేసిన కేసులను కోర్టు కొట్టివేసింది.
కేఆర్పీపీ పార్టీ
ఇదే కేసులో గాలి జనార్ధన్ రెడ్డి దోషిగా తేలారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది సీబీఐ స్పెషల్ కోర్టు. అదే ఇప్పుడు ఆయనకు రాజకీయంగా కూడా చిక్కులను తెచ్చిపెట్టింది. క్రియాశీలక రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేసినట్టయింది. కర్ణాటక అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షి(Assembly Secretary )నోటిఫికేషన్ జారీ చేశారు.కర్ణాటక శాసనసభ సభ్యుడు జి. జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించినందున, ఆయన దోషిగా తేలిన తేదీ నుండి కర్ణాటక శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడమైనది” అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఇ) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష తరఫున పోటీ చేశారు. దాదాపు 8,000 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన ఇక్బాల్ అన్సారీని ఓడించారు.2022లో కేఆర్పీపీ పార్టీని స్థాపించారు గాలి. ఆ తరువాత దీన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. మైనింగ్ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించడానికి ముందు ఆయన యడియూరప్ప ప్రభుత్వంలో కర్ణాటక పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2015 నుండి బెయిల్‌పై ఉన్న ఆయన బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు.
అధికార
ఓబుళాపురం మైనింగ్ కేసు తీర్పులో, గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం కలిగించారని పేర్కొంటూ జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2009 నాటి ఈ కేసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన భారీ అవినీతిని వెలుగులోకి తెచ్చింది.ఈ తీర్పును కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వి.ఎస్. ఉగ్రప్ప మాట్లాడుతూ, “జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడం దేశవ్యాప్తంగా అవినీతి రాజకీయ నాయకులకు బలమైన సందేశం పంపుతుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసే నాయకులు చివరికి న్యాయాన్ని ఎదుర్కోవాల్సిందేననడానికి ఇదో ఉదాహరణ” అని అన్నారు.
Read Also: Pakistan plans cyber attack: ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్‌తో సైబర్ దాడికి పాక్ ప్లాన్