📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Mamata Banerjee: బెంగాల్ ​లో ‘వక్ఫ్’ చట్టాన్ని అమలు చేయబోం: మమత బెనర్జీ

Author Icon By Vanipushpa
Updated: April 9, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగాల్ లో వక్ఫ్ సవరణ చట్టం అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అన్ని వర్గాల మైనారిటీలతోపాటు వారి ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయం కోసం కొందరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తారని, వాటిని వినవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోల్‌కతాలో జైన సమాజం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కీలక వ్యాఖ్యలు చేశారు.
విభజించు- పాలించు ఇక్కడ పని చేయదు
“వక్ఫ్ చట్టం అమలు కారణంగా మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. నమ్మకంగా ఉండండి. అందరూ కలిసి ఉంటామని సందేశం ఇవ్వండి. విభజించు- పాలించు అనేది జరగదు. వక్ఫ్ అమలు చేయడం కన్నా ముందు బంగ్లాదేశ్​లో ఏం జరుగుతుందో చూడండి. అందుకే వక్ఫ్ చట్టం అమలు చేయబోం “ అని మమత అన్నారు.

‘వారిని రక్షణ కల్పించడం మా బాధ్యత’
“బెంగాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్​, భారతదేశం అన్నీ కలిసి ఉన్నాయని చరిత్ర చెబుతోంది. విభజన తరువాత వారు ఇక్కడ నివసిస్తున్నారు. వారిని రక్షణ కల్పించడం మా పని. మనం జీవించు, జీవించనివ్వు అనే సందేశాన్ని ఇవ్వాలి. ఎవరైనా మిమ్మల్ని రాజకీయంగా సమావేశమవ్వమని రెచ్చగొడితే, దయచేసి అలా చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీదీ మిమ్మల్ని, మీ ఆస్తిని రక్షిస్తుందని దయచేసి గుర్తుంచుకోండి. మనం కలిసి ఉంటే, ప్రపంచాన్ని జయించగలం” అని దీదీ తెలిపారు.
“అందరూ ఐక్యంగా ఉందాం. ఐక్యత నుంచి నన్ను ఎవరూ వేరు చేయలేరు. ప్రతి మతం, కులం మానవత్వం కోసమే ప్రార్థిస్థాయి. దుర్గా పూజ, కాళీ పూజ, జైన, బౌద్ధ దేవాలయాలు, గురుద్వారా, చర్చి, గురు రవిదాస్ ఆలయానికి నేను వెళ్తాను. రాజస్థాన్‌లో అజ్మీర్ షరీఫ్‌తో పాటు పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని కూడా సందర్శించాను” అని ఆమె గుర్తు చేశారు.

READ ALSO: RBI: లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి

'Wakf' law will not be implemented in Bengal #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Mamata Banerjee Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.