📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Vijay Malya: ఆర్సీబీ కొనుగోలు వెనుక అసలు విషయాన్నీ చెప్పిన విజయ్ మాల్యా

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఎట్టకేలకు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.కానీ బెంగళూరు చేరుకున్న తర్వాత వారి వేడుక కాస్త సంతాపంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) బయట జరిగిన వేడుకల సందర్భంగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో పాటు 50 మందికికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ జట్టు 2008 నుంచి లీగ్‌లో భాగంగా ఉంది. కానీ 18వ సీజన్‌లో మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టు విజయం తర్వాత అభిమానులు పరారీలో ఉన్న విజయ్ మాల్యాను కూడా గుర్తు చేసుకున్నారు. విజయ్ మాల్యా ఆర్సీబీ ఫ్రాంచైజీకి మొదటి యజమాని కూడా.అయితే విజయ్ మాల్యా రాజ్ షమానీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

విస్కీ బ్రాండ్

ఆ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా(Vijay Malya) కీలక వివరాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో సహా మూడు ఫ్రాంచైజీలకు బిడ్ వేసినట్లు తెలిపాడు. అయితే ముకేశ్ అంబానీ అత్యధిక ధరను కోట్ చేయడంతో కొనలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని అతి తక్కువ తేడాతో కోల్పోయిన తర్వాత విజయ్ మాల్యా చివరకు 112 మిలియన్ల యూఎస్ డాలర్లకు ఆ సమయంలో ఆర్సీబీ(RCB)ని కొనుగోలు చేశాడు. ఆ సమయంలో 2008లో 112 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ రూ.600-700 కోట్లు అని ఆర్సీబీని కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం తన విస్కీ బ్రాండ్ “రాయల్ ఛాలెంజ్” ని ప్రోత్సహించడమేనని విజయ్ మాల్యా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో దాని వెనుక ఆయనకు క్రికెట్ పట్ల ప్రేమ లేదని తెలుస్తోంది.

వేలం వేయబోతున్నామని

విజయ్ మాల్యా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ”ఈ లీగ్‌కు సంబంధించి లలిత్ మోడీ(Lalit Modi) బీసీసీఐ కమిటీకి చెప్పిన మాటల నేపథ్యంలో నేను చాలా సంతోషం వ్యక్తం చేశాను. అతను ఓ రోజు ఫోన్ చేసి జట్లు వేలం వేయబోతున్నామని చెప్పాడు. ఈ జట్లలో దేనినైనా కొనడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. నేను మూడు ఫ్రాంచైజీలపై ఆసక్తి చూపించాను. బిడ్ వేశాడు. నేను ముంబై ఫ్రాంచైజీని చాలా తక్కువ తేడాతో కొనుగోలు చేయలేకపోయాను.” అని మాల్యా పేర్కొన్నారు.

Vijay Malya

డైనమిక్ జట్టు

2008లో ఆర్సీబీ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేసినప్పుడు ఐపీఎల్‌ను భారత క్రికెట్‌కు గేమ్ ఛేంజర్‌గా చూశాను.నేను 112 మిలియన్ల డాలర్లు చెల్లించాను. అది రెండో అత్యధిక బిడ్, ఎందుకంటే ఆర్సీబీ జట్టు సామర్థ్యాన్ని నేను నమ్మాను. ఆర్సీబీని మైదానంలో మాత్రమే కాకుండా బయట కూడా అద్భుతంగా కనిపించే బ్రాండ్‌గా మార్చాలని నేను కోరుకున్నాను. అందుకే దానిని అత్యధికంగా అమ్ముడుపోయే మా లిక్కర్ బ్లాండ్లలో ఒకటైన రాయల్ ఛాలెంజ్‌తో అనుసంధానించి దానికి ఆ బోల్డ్ ఐడెంటిటీని ఇచ్చాను” అని విజయ్ మాల్యా చెప్పుకొచ్చారు.

గర్వకారణమైన క్షణం

విరాట్ కోహ్లీని కొనుగోలు చేయడం గురించి కూడా విజయ్ మాల్యా వివరించాడు. విరాట్ కోహ్లీని తన రాష్ట్ర జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్) కొనుగోలు చేస్తుందని భావించినప్పటికీ ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రదీప్ సంగ్వాన్‌(Pradeep Sangwan)ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ విరాట్ కోహ్లీతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం లభించింది. తాను ఆర్సీబీని పవర్‌హౌస్‌గా మార్చగల ఆటగాళ్లను ఎంచుకున్న విజయ్ మాల్యా చెప్పాడు. అండర్-19 ప్రపంచకప్ జట్టు నుంచి యువ ఆటగాడు విరాట్ కోహ్లీని కొనుగోలు చేయడం తనకు గర్వకారణమైన క్షణం అంటూ విజయ్ మాల్యా పేర్కొన్నాడు. ఈ ఆటగాడు ప్రత్యకమైనవాడని తనకు అంతర్గతంగా ఒక భావన ఉందన్నాడు. అందుకే అతని కోసం బిడ్ వేసినట్లు చెప్పాడు. ఎంపిక ప్రక్రియకు కొద్దిసేపటి ముందు కోహ్లీ అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతని ఆటతోనన్ను చాలా ఆకట్టుకున్నానన్నాడు.అందుకే అతడిని ఎంచుకున్నానన్నాడు. 18 ఏళ్ల తర్వాత కోహ్లీ అదే జట్టులో ఉండడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు.

Read Also: Piyush Chawla: అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పీయూష్ చావ్లా

#IPLHistory #mumbaiindians #RCB #VijayMallya Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.