📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Vance : మృతులకు సంతాపం తెలిపిన వాన్స్

Author Icon By Divya Vani M
Updated: April 23, 2025 • 8:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిపై అమెరికా గట్టిగా స్పందించింది.ఈ దాడిలో పర్యాటకులు లక్ష్యంగా మారడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.అమాయకులపై జరిగిన ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది.ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంభాషణలో, వాన్స్ తాను బాధిత కుటుంబాల పట్ల గాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.అదే సమయంలో, ఉగ్రవాదంపై పోరాటానికి భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా విదేశాంగ శాఖ వివరాల ప్రకారం, వాన్స్ ఈ దాడిని ‘హేయమైన చర్య’గా పేర్కొన్నారు. ఆగ్రాలో ఉన్న సమయంలో మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన, భారత్ ప్రజలకు అమెరికా పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు కలిసే ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ఘన నివాళులు అర్పించిన వాన్స్, అతి త్వరలో బాధ్యులను న్యాయానికి తీసుకురావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత్‌కు అవసరమైన టెక్నికల్, ఇంటెలిజెన్స్ మద్దతును అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.

Vance మృతులకు సంతాపం తెలిపిన వాన్స్

అమాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, ఇది క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల వెనక ఉన్న శక్తులను మట్టుపెట్టేందుకు అమెరికా భారత్‌తో డుగా పనిచేస్తుందని చెప్పారు. ట్రంప్ తన మాటల్లో, “భారత్‌కి పూర్తి మద్దతు ఇచ్చేందుకు మేము సిద్ధం. ఉగ్రవాదానికి ఎలాంటి మినహాయింపు లేదు” అని స్పష్టం చేశారు. భారత్‌పై దాడులు జరుగుతుంటే మేము చూసిచూపించుకోము” అని తెలిపారు.ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అమెరికా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేశ భద్రత కోసం భారత్ ఎలా కట్టుబడి ఉందో ఆయన స్పష్టం చేశారు. “పిరికివాళ్ల చర్యలకు తలొగ్గేది లేదు. దాని వెనకున్న శక్తులను శిక్షించటం మా బాధ్యత,” అని మోదీ చెప్పినట్లు విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. పహల్గామ్ ఘటనతో అంతర్జాతీయ సమాజం ఒక్కటవుతోంది. భారత్‌కు మద్దతుగా నిలుస్తూ, ఉగ్రవాదంపై గట్టిగా స్పందిస్తోంది. ఇది భారత కౌరవాన్ని, స్థైర్యాన్ని చాటే సందర్భంగా మారింది.

Read Also : Pahalgham : కాశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతి

India America strategic support terrorism Jammu Kashmir tourism attack news Mike Pence India visit Modi Trump phone call Pahalgam terror attack 2025 US condemns terror in Kashmir US India anti-terror partnership US response to Kashmir attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.