ఆత్మీయ అనుబంధాలు కరిగిపోతున్నాయి. కామంతో కళ్లుమూసుకున్న వాడికి వావివరుసలు కనిపించవు. క్షణికమైన సుఖం కోసం ఎంత ఘోరానికైనా తెగిస్తారు అనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం (uttarpradesh) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయా
జిల్లాలో రక్షాబంధన్ రోజున వరుసకు చెల్లి అయిన బాలికకు రాఖీ కట్టాడు.
రాత్రి మద్యంమత్తులో ఆ బాలికపై అత్యాచారం చేసి, ఆపై
కూతమార్చాడు. 33ఏళ్ల సుర్జీత్ అనే వ్యక్తికి 14 ఏళ్ల బాలిక వరుసకు చెల్లి అవుతుంది. రక్షాబంధన్ రోజున బాధితురాలు అతనికి రాఖీకట్టింది. ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. అదే రాత్రి, బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు సుర్జీత్. గదిలో నిద్రపోతున్న14 ఏళ్ల బాలిపై సుర్జీత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (rakhi)ఆ తర్వాత ఆ బాలికను చంపి, మృతదేహాన్ని ఉరికి వేలాడదీశాడు. ఆమెతండ్రి ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుండటంతో పాపం ఈ విషయం అతనికి తెలియకుండా పోయింది.
ఆత్మహత్యగా నాటకం
మరుసటి రోజు సుర్జీత్ ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి చేరుకున్న పోలీసులకు అనేకచోట్ల రక్తపు మరకలుకనిపించడంతో ఇది ఆత్మహత్య కాదని హత్యగా తేల్చేశారు. సుర్జీత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగానేర్చాన్ని అంగీకరించాడు. బాధితురాలి గోళ్లు, చేతిలో ఉన్న సుర్జీత్ వెంట్రుకల నమూనాలతో నిందితుడిని పట్టుకున్నారు.
అన్నయ్య అని ప్రేమతో రాఖీ కట్టిన ఆ చెల్లిని
ఆప్యాయంగా చూసుకోవాల్సిన కామాంధుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి, తప్పించుకునే ప్రయత్నం చేసాడు. నిందితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో పోలీసులకు దొరికిపోతారు. పాపం వారిని ఏదో ఒక విధంగా పట్టుపడేలా చేస్తుంది.