📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Uttar Pradesh: అనుమానంతో ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

Author Icon By Anusha
Updated: June 3, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతి అత్యంత పాశవికంగా హత్యకు గురైంది. శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆమె, ఆదివారం మైనాథెర్ ప్రాంతం(Mynather area)లోని ఓ గ్రామానికి వెలుపల ఉన్న మొక్కజొన్న చేనులో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సోమవారం విడుదలైన పోస్టుమార్టం నివేదికలో హత్య ఎంత క్రూరంగా జరిగిందో వెల్లడైంది. యువతి శరీరంపై, ప్రైవేటు భాగాలతో సహా మొత్తం 40కి పైగా స్క్రూడ్రైవర్‌(Screwdriver)తో పొడిచిన గాయాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. తీవ్ర రక్తస్రావం వల్లే ఆమె మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది.

స్క్రూడ్రైవర్‌తో

ఈ దారుణానికి పాల్పడింది 20 ఏళ్ల మహమ్మద్ రఫీ(Mohammed Rafi) అని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. తాను యువతికి ప్రియుడిని అని, గత మూడు నెలలుగా ఆమె వేరొక వ్యక్తితో మాట్లాడుతుండటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని రఫీ చెప్పినట్లు పోలీసులు వివరించారు.మొదట యువతి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించానని, ఆమె స్పృహతప్పి పడిపోయాక, స్క్రూడ్రైవర్‌తో ఊపిరి ఆగిపోయేంతవరకూ కసిదీరా పొడిచానని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం(Rape) జరిగినట్లు నిర్ధారణ కాలేదని, అయితే ప్రతీకార చర్యగా యువతి ప్రైవేటు భాగాలపై స్క్రూడ్రైవర్‌తో అనేకసార్లు పొడిచినట్లు తేలిందని అధికారులు తెలిపారు.

Uttar Pradesh

పరిచయం

మైనాథెర్ ఎస్‌హెచ్‌ఓ కరన్ పాల్ సింగ్ మాట్లాడుతూ, “నిందితుడు కోళ్ల వ్యాపారి. గత ఏడాది కాలంగా ఆ యువతితో పరిచయం ఉందని, ఆమెకు ఒక మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చినట్లు చెబుతున్నాడు” అని తెలిపారు.బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రఫీపై పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేశారు.”మేకలకు మేత తేవడానికి వెళుతున్నానని చెప్పి నా కూతురు శనివారం సాయంత్రం(Saturday Night) ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో మేమంతా వెతకడం మొదలుపెట్టాం. మొక్కజొన్న చేనులో నా కూతురు హత్యకు గురైన విషయం తెలిశాక పోలీసులకు సమాచారం ఇచ్చాం. మహమ్మద్ రఫీ తరచూ నా కూతురిని వేధించేవాడు, తనతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఈ హత్యలో అతని ప్రమేయం ఉందని మాకు అనుమానంగా ఉంది” అని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.”ఈ కేసులో త్వరలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం” అని ఎస్‌హెచ్‌ఓ కరన్ పాల్ సింగ్ వెల్లడించారు. 

Read Also: Gagan Deep: ISI, ఖలిస్తానీతో పాటు ఉగ్రవాదంతో బలమైన సంబంధాలున్న గగన్‌ దీప్‌

#justiceforvictim #Moradabad #UttarPradesh #ViolenceAgainstWomen Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.