📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Uttar Pradesh: ఆత్మహత్య కు పాల్పడిన ప్రేయసిని పెళ్లాడిన యువకుడు

Author Icon By Anusha
Updated: June 17, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆ యువకుడు, యువతి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్టుగా మమేకమయ్యారు. తమ ప్రేమను వివాహ బంధంగా మలచుకోవాలనే ఆశతో ఇరువురు కుటుంబసభ్యులను ఒప్పించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి సన్నాహాలు కూడా మొదలయ్యాయి.కానీ ఇంతలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.అనుకోకుండా,వారి మధ్య జరిగిన ఒక చిన్నపాటి గొడవ అయ్యింది. ఈ నేపథ్యంలోనే, తట్టుకోలేకపోయిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలుసుకున్న ఆ యువకుడు శోకసంద్రంలో మునిగిపోయాడు.ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు కోల్పోయినా ఆమెను భార్యగా అంగీకరించి చివరి క్షణాల్లో ఆమెకు పెళ్లి తంతు జరిపించి చితిపై పంపిన సంఘటన ప్రతి ఒక్కరి మనసును కలచివేసేలా చేసింది.

పెళ్లికి ముహూర్తాలు

ఈ విషాదం ఎక్కడ జరిగిందంటే,ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల ప్రియాంక మదేశియా 29 ఏళ్ల సన్నీ మదేశియా గత మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఎలాగైనా సరే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్న వీళ్లు ఇరుకుటుంబాలను ఒప్పించారు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించుకున్నారు. అయితే నవంబర్ 29వ తేదీనే వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖరారు అయింది. మరికొన్ని రోజుల్లోనే ఒక్కటవుతున్నామన్న ఆశతో తెగ సంబుర పడిపోయిన వీరి మధ్య చిన్న సమస్య వచ్చింది. ఒకరినొకరు మాట అనుకున్నారు. ఈమాత్రం దానికి ప్రియాంక మదేశియా (Priyanka Madesia) కఠిన నిర్ణయం తీసుకుంది.ప్రియుడితో చిన్న గొడవను కూడా జీర్ణించుకోలేకపోయిన ఆమె ప్రాణాలు తీసుకుంది. ఇంట్లోనే ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

స్థానికులు

అయితే ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా బిడ్డ చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే కాబోయే అల్లుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో సన్నీ (Sunny) కూడా వెంటనే అక్కడకు వచ్చాడు. ప్రియురాలిని చూసి తీవ్రంగా రోదించాడు. నన్నెందుకు వదిలి పెట్టి వెళ్లావంటూ గుండెలు బాదుకున్నాడు. ఇతడు ఏడ్వడం చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టారు.ఈక్రమంలోనే గ్రామస్థులు, బంధువులు అంతా కలిసి ప్రియాంక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్నానం చేయించి పాడెపై పడుకోబెట్టి మరీ ఊరేగింపు చేశారు.

కుటుంబ సభ్యులు

మరికాసేపట్లోనే చితిపై పడుకోబెట్టి ఆమె ఆత్మకు శాంతి కల్గిస్తారనేలోపే సన్నీ ఓ పంతులు సహా అక్కడకు వచ్చాడు. ప్రియాంక తన భార్యగా మారాకే అంత్యక్రియలు చేయాలనుకున్నట్లు చెప్పాడు. కుమార్తె కోరిక కూడా అదే కాగా ఆ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. దీంతో మృతదేహంతోనే పెళ్లికి సిద్ధం అయ్యాడు సన్నీ,ముఖ్యంగా ప్రియాంక మృతదేహాన్ని కింద పడుకోబెట్టగా శ్మశానంలోనే సన్నీ ఆమె నదుటిన సింధూరం పెట్టాడు. ఆపై ఆమెతో ఏడు అడుగులు వేస్తున్నట్లు భావించి ఆమె చుట్టూ తరిగాడు.

వారందరి చేత

ఇలా పెళ్లి తంతు ముగించిన సన్నీ తానే తన భార్యకు చివరి ఖర్మలు చేస్తానని చెప్పాడు. అలా అతడే దగ్గరుండి మరీ ప్రియురాలి చితికి నిప్పంటించాడు. ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న వారందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే రెండు కుటుంబాల సమ్మతితోనే ఈ వివాహం జరిగిందని స్థానిక పోలీసులు కూడా ధృవీకరించారు. మరణం కూడా విడదీయలేని ప్రేమకు ఇది నిదర్శనంగా నిలిచిందని చెప్పారు.

Read Also: Karnataka: కర్నాటకలో బైక్‌ ట్యాక్సీ సర్వీసులు బంద్‌

#LoveBeyondDeath #TillDeathDoUsPart #TragicLoveStory #UttarPradesh Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.