📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Uttar Pradesh: పెట్రోల్ బంక్‌లో ఓ సిబ్బంది పై గన్ తో బెదిరించిన యువతీ

Author Icon By Ramya
Updated: June 20, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని హర్దోయ్‌లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం (జూన్ 15) ఒక కుటుంబం గ్యాస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా కారులోని వారిని కిందికి దిగమని అడగటం, అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అయితే, ఈ గొడవ మరింత ముదిరి, చివరకు కారులో ఉన్న ఓ యువతి హ్యాండ్‌బ్యాగ్ నుండి తుపాకీ (Gun) తీసి, పెట్రోల్ బంక్ సిబ్బంది ఛాతీపై గురిపెట్టి బెదిరించింది. ఈ దృశ్యాలు గ్యాస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హర్దోయ్‌లో షాకింగ్ ఘటన: తుపాకీతో బెదిరింపులు

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హర్దోయ్‌లో ఆదివారం (జూన్ 15) సాయంత్రం ఒక సీఎన్‌జీ పెట్రోల్ బంక్‌కి (CNG petrol station) ఎహ్సాన్ ఖాన్ (Ehsaan Khan) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. ఆయిల్ ఫిల్ చేస్తున్న రజనీష్ కుమార్ (Rajneesh Kumar) అనే వర్కర్, భద్రత దృష్ట్యా కారులో ఉన్న వారిని బయటకు రావాలని సూచించాడు. అయితే, కారు దిగడానికి నిరాకరించిన ఎహ్సాన్ ఖాన్, రజనీష్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో రజనీష్ కాస్త దురుసుగా ప్రవర్తించడంతో, అదే కారులో ఉన్న ఎహ్సాన్ ఖాన్ కూతురు అరిబాకు పట్టరాని కోపం వచ్చింది.

కోపంతో కారు దిగిన అరిబా, తన హ్యాండ్‌బ్యాగ్ నుంచి ఒక రివాల్వర్‌ను తీసి, నేరుగా రజనీష్ (Rajaneesh Kumar) కుమార్ ఛాతీపై గురి పెట్టింది. “ఇట్నీ గోలియాన్ మారుగి కి ఘర్ వాలే పెహ్చాన్ నహీ పాయేగే” (నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా బుల్లెట్లతో కాల్చిపారేస్తా) అంటూ బెదిరించింది. ఈ ఘటనతో బంకులోని ఇతర సిబ్బంది భయపడి జోక్యం చేసుకోగా, పరిస్థితి సర్దుమనిగింది. అరిబా తల్లి ఆమెను తిరిగి కారులోకి తీసుకువెళ్లింది. అనంతరం ఆ కుటుంబం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సీసీటీవీ ఫుటేజ్, పోలీసుల చర్యలు

ఈ ఘటనపై గ్యాస్ స్టేషన్ సిబ్బంది, రజనీష్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ బంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, రజనీష్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఎహ్సాన్ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయిన రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటన భద్రతా నిబంధనలను పాటించకపోవడం, చిన్న విషయాలకే కోపంతో ఆయుధాలు ప్రయోగించడం వంటి వాటిపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆయుధ సంస్కృతి ప్రమాదకరంగా మారుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి.

Read also: Air India Plane Crash: మృతుల గుర్తింపులో డీఎన్‌ఏ పరీక్షలే ఆధారం!

#CCTV #Crime News #Gas Station #Gun Threat #Hardoi #Police Action #Security #Uttar Pradesh #Viral Video #Viral_Issue Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.