📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest News: Vijay: టీవీకే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు: కేంద్ర ఎన్నికల సంఘం

Author Icon By Aanusha
Updated: October 17, 2025 • 10:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే (తళపతి విజయ్ కజగం) పార్టీ (Tamilaga Vettri Kazhagam) కి సంబంధించి, కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు (High Court) కు సమర్పించిన నివేదికలో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆ నివేదిక ప్రకారం, టీవీకే పార్టీ ప్రస్తుతం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు. అంటే, ఎన్నికల సంఘం దృష్టిలో ఇది ఇప్పటివరకు అధికారికంగా నమోదైన పార్టీగా పరిగణించబడలేదు.

Read Also: FSSAI: ORS పదం దుర్వినియోగంపై FSSAI చర్యలు

కరూర్‌లో జరిగిన దుర్ఘటన తర్వాత మరింత చర్చనీయాంశమైంది. విజయ్ (Vijay) కరూర్ జిల్లాలో నిర్వహించిన భారీ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై ప్రజా వర్గాలు, రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సభ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపును రద్దు చేయడంతో పాటు రాజకీయ పార్టీల ప్రచార సభల్లో మహిళలు, చిన్నారులు పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.వీటిని సీజే జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మరుగణ్‌ల ధర్మాసనం విచారించింది.

Vijay

ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ కోర్టులో వాదనలు వినిపించారు. టీవీకే పార్టీకి గుర్తింపు లేనందున ఆ పార్టీకి ఆ హోదా రద్దు చేయాలనే అభ్యర్థన నిలబడదని కోర్టుకు తెలిపారు.మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు మినహా ఈ కేసుల విచారణకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా వాటన్నింటినీ హైకోర్టు పాలనా వ్యవహారాల విభాగం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Election Commission Karur incident latest news Madras High Court Telugu News TVK party vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.