తమిళ సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే (తళపతి విజయ్ కజగం) పార్టీ (Tamilaga Vettri Kazhagam) కి సంబంధించి, కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు (High Court) కు సమర్పించిన నివేదికలో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆ నివేదిక ప్రకారం, టీవీకే పార్టీ ప్రస్తుతం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు. అంటే, ఎన్నికల సంఘం దృష్టిలో ఇది ఇప్పటివరకు అధికారికంగా నమోదైన పార్టీగా పరిగణించబడలేదు.
Read Also: FSSAI: ORS పదం దుర్వినియోగంపై FSSAI చర్యలు
కరూర్‌లో జరిగిన దుర్ఘటన తర్వాత మరింత చర్చనీయాంశమైంది. విజయ్ (Vijay) కరూర్ జిల్లాలో నిర్వహించిన భారీ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై ప్రజా వర్గాలు, రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సభ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపును రద్దు చేయడంతో పాటు రాజకీయ పార్టీల ప్రచార సభల్లో మహిళలు, చిన్నారులు పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.వీటిని సీజే జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మరుగణ్‌ల ధర్మాసనం విచారించింది.

ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ కోర్టులో వాదనలు వినిపించారు. టీవీకే పార్టీకి గుర్తింపు లేనందున ఆ పార్టీకి ఆ హోదా రద్దు చేయాలనే అభ్యర్థన నిలబడదని కోర్టుకు తెలిపారు.మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు మినహా ఈ కేసుల విచారణకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా వాటన్నింటినీ హైకోర్టు పాలనా వ్యవహారాల విభాగం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: