📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ayodhya Ram Mandir Tunnel: అయోధ్య భక్తుల సౌకర్యం కోసం వేగంగా టన్నెల్ పనులు

Author Icon By Anusha
Updated: April 19, 2025 • 2:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీరాముడు పుట్టిన నేల అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ఎంతో వేగంగా, అత్యున్నత ప్రమాణాలతో కొనసాగుతున్నాయి.రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో రామమందిర ప్రాంగణంలో భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని నిర్మించారు.లక్షన్నర మంది భక్తులు ఒకేసారి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 800 మీటర్ల పొడవైన గోడను కడుతున్నారు. ఇది దాదాపుగా 75 శాతం పూర్తైంది. దీంతో పాటుగా ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య ఇబ్బంది తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేల మట్టానికి దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించారు. దేశంలోనే ఆలయంలో నిర్మించిన మొట్టమొదటి సొరంగం ఇదే.ఆలయ సింహద్వారంలోకి భక్తులు ప్రవేశించగానే తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా వెళితే నేరుగా ఆలయంలోకి వెళ్లొచ్చు. దాని పక్కనే బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది. ఈ ద్వారంలో వెళితే సొరంగ మార్గం ద్వారా బయటకు వెళతారు. ఈ సొరంగాన్ని ప్రవేశ మార్గం కిందనే నిర్మించారు.

వినోద్ మెహతా

అయోధ్య రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీని సులభంగా నివారించే విధంగా సొరంగాన్ని రూపొందించామని ఎల్అండ్​టీ ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా తెలిపారు. ఈ టన్నెల్ ఆలయంలో ప్రవేశించేవారికి, ప్రదక్షిణ చేసేవారికి మధ్య రద్దీని నివారించడంలో సహాయపడుతుందని చెప్పారు. ప్రదక్షిణ కోసం 800మీటర్ల పొడవైన గోడను నిర్మించే ప్రాజెక్టులో సొరంగం ఓ భాగమని వెల్లడించారు. “రామమందిరాన్ని సందర్శించే వారి సంఖ్యను అంచనా వేయలేం. ప్రతిరోజూ 1.5 లక్షల మంది సందర్శకులు ప్రదక్షిణలు చేసుకునేలా ఓ గోడను నిర్మించాం. దీని గుండా భక్తులు ఆలయానికి చేరుకోవాలి. అక్టోబర్ నాటికి సొరంగం పనులు పూర్తవుతాయి.” అని పేర్కొన్నారు.మూడు అంతస్తుల్లో నిర్మితమవుతున్న రామమందిరం ఎత్తు 161 అడుగులు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నిర్మాణం కొనసాగుతుండగా, 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మరో 6 ఆలయాలను సైతం కడుతున్నారు.

పవిత్ర స్థలం

అయోధ్యలో రామమందిరం జనవరి 22, 2024న ప్రారంభోత్సవం జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ వంటి నాయకులు వందలాది మంది భక్తులతో పాటు హాజరయ్యారు.రాముడి జన్మస్థలంగా విశ్వసించే పవిత్ర స్థలంలో నిర్మించబడిన 161 అడుగుల ఎత్తైన, మూడు అంతస్తుల ఆలయ సముదాయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో చెక్కబడిన రాళ్లతో విస్తరించి ఉంది. ప్రధాన గర్భగుడిలో నల్ల రాయితో చెక్కబడిన రామ్ లల్లా యొక్క గంభీరమైన విగ్రహం ఉంది.

Read Also: Underworld Don: అండర్ వరల్డ్ డాన్ కొడుకు రిక్కీ రాయ్‌పై హత్యాయత్నం

#AyodhyaRamMandir #AyodhyaUpdate #DevoteeFacilities #RamMandirConstruction #SeamlessDarshan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.