📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Trump: అమెరికా హెచ్-1బి వీసాలపై దిమ్మతిరిగే న్యూస్

Author Icon By Saritha
Updated: December 1, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ఐటీ రంగంలో సంచలనం రేపిన తాజా పరిణామంలో భారతీయ ఐటీ కంపెనీలకు జారీ చేయబడిన కొత్త హెచ్-1బీ వీసా(Trump) ఆమోదాలు 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,573 మాత్రమే నమోదయ్యాయి. ఇది గత పది సంవత్సరాలలో అత్యల్ప స్థాయిగా చరిత్రలో నిలిచింది. యుఎస్ సిఐఎస్ అధికారిక రికార్డులను ఆధారంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ వెల్లడించిన డేటా సంఖ్యల కంటే దాదాపు 70శాతం పడిపోయినట్టుగా సూచిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రమే ఈ సంవత్సరం హెచ్-1బీ యజమానుల జాబితాలో అగ్రస్థానం పొందిన భారతీయ కంపెనీగా నిలిచింది. అమెరికన్ టెక్ దిగ్గజాలు అయిన అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు భారీ సంఖ్యలో వీసాలు పొందుతుండగా.. భారతీయ ఐటీ సంస్థల ఆమోదాలు గణనీయంగా తగ్గాయి. అమెరికా(America) వలస విధానాలలో పెరిగిన కఠినత, వీసా ప్రాసెసింగ్పై పెరిగిన పరిశీలన, అలాగే అమెరికాలో స్థానిక ప్రతిభను నియమించుకోవాలని ఒత్తిడి.. ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read also: ఏపీలో జిల్లాల పునర్విభజనపై కొత్త డిమాండ్లు

Breaking news on US H-1B visas

వర్క్ మోడల్లో కూడా కీలక మార్పులు

వర్క్ మోడల్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ఐటీ(Trump) సంస్థలు ఆన్ షోర్ వీసాలపై ఆధారాన్ని తగ్గిస్తూ లోకల్ నియామకాలను పెంచుతూ, నియర్-షోర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. రిమోట్ ప్రాజెక్ట్ డెలివరీ నమూనాలను ఆచరణలోకి తెచ్చాయి. అయితే, హెచ్ -1బీ వీసాల తగ్గుదల భారతీయ కంపెనీలను మరిన్ని సవాళ్ల ఎదుట నిలబెట్టింది. వీటిలో ముఖ్యమైనవి క్లయింట్ ప్రాజెక్ట్ ల సమయపాలనలో కష్టాలు, పూర్తి చేసే గడువులను తిరిగి చర్చించుకోవాల్సిన అవశ్యకత, ఆపరేషనల్ ఖర్చుల అధిక భారాన్ని నిర్వహించడం వంటివి ఉన్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

amazon Google H-1B Visa Indian IT companies Indian Workforce Latest News in Telugu Meta Microsoft TCS tech jobs US Immigration USICS Visa Approvals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.