📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

IRCTC: ట్రెయిన్ వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణికుల ఆగ్రహం.. రైల్వే శాఖపై విమర్శలు

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 9:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైల్వే శాఖ ఇటీవల తీసుకున్న వెయిటింగ్ లిస్ట్ పరిమితి నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల జూన్ 16 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, రైళ్లలోని వెయిటింగ్ టిక్కెట్లను కేవలం 25 శాతం వరకు మాత్రమే అనుమతించనున్నారు. అయితే ఈ నిర్ణయం ప్రయాణికులకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ప్రయాణాల కోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో, వెయిటింగ్ లిమిట్‌ను తగ్గించడం ఎంతమేరకు సమంజసం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీనిపై రైల్వే బోర్డు స్పందిస్తూ, ప్రయాణికుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా, గతంలో నాలుగు నెలలుగా ఉన్న అడ్వాన్స్ బుకింగ్‌ (Advance booking) ను కూడా రెండు నెలలకు రైల్వే శాఖ కుదించిన విషయం తెలిసిందే.రైళ్లలో వెయిటింగ్ లిస్టులను తగ్గించడం వల్ల డిమాండ్ తెలుసుకోవడం కష్టమవుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.

రద్దీగా ఉండే రూట్లలో ఎక్కువ రైళ్లు

వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంటే, దానికి తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు పరిమితి విధించడంతో డిమాండ్ ఎలా తెలుస్తుందని రైల్వేకు చెందిన రిటైర్డ్ అధికారి ప్రశ్నించారు. రద్దీగా ఉండే రూట్లలో ఎక్కువ రైళ్లు నడపడమే దీనికి పరిష్కారమని ఆయన సూచించారు. వెయిటింగ్ లిస్ట్ తగ్గడంతో రైల్వేకు వచ్చే ఆదాయంలో కోత పడనుందని పేర్కొన్నారు.కొత్త విధానం వల్ల కొన్నిసార్లు రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉండి, ఆదాయం తగ్గే అవకాశం ఉందని రిజర్వేషన్ సూపర్‌వైజర్లు (Reservation Supervisors) అభిప్రాయపడుతున్నారు. రైలు బయలుదేరే ముందు ఏజెంట్లు పరిస్థితిని తెలుసుకొని, కరెంట్ రిజర్వేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే, రైల్వే బోర్డు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. ‘‘సమగ్ర అధ్యయనం తర్వాతే 25% పరిమితిని తీసుకువచ్చాం. 

Train waiting tickets:

ఏసీ లేదా ఎకానమీ క్లాస్ టిక్కెట్లకు

రోడ్‌సైడ్ స్టేషన్లకు కేటాయించిన కోటా కేవలం 2–3 సీట్లు మాత్రమే. అక్కడ కూడా 25% లిమిట్ ఎలా నిర్ణయిస్తారనేది స్పష్టంగా లేదు. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 2013లో కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ లేదా ఎకానమీ క్లాస్ టిక్కెట్లకు 30 , సెకెండ్ ఏసీకి 100, థర్డ్ ఏసీ/చైర్ కార్‌కు 300, స్లీపర్‌కు 400 వరకు వెయిటింగ్ లిమిట్ఉండేది. ప్రస్తుతం 25% పరిమితితో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండే స్థానాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. కాగా, జులై 1 నుంచి క్రమంగా రైళ్ల ఛార్జీ (Train charge) లను పెంచుతున్న సంగతి తెలిసింది. దశలవారీగా ఈ పెంపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Read Also: Amit Shah: అమిత్ షా చేతుల మీదుగా నేడు తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

#IndianRailways #IRCTCUpdate #RailwayWaitingList #TrainTicketPolicy Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.