📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Pahalgham Attack: కశ్మీర్‌ టూర్ ను క్యాన్సల్ చేసుకుంటున్న పర్యాటకులు

Author Icon By Vanipushpa
Updated: April 23, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ప్రభావం కశ్మీర్ పర్యాటక రంగంపై పడుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కశ్మీర్ పర్యాటక రంగాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడి పర్యాటకులలో భయాందోళనలను రేకెత్తించడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలను పంపింది. దాడి జరిగిన వెంటనే పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడం ప్రారంభించారు.

80 శాతం బుకింగ్‌లు రద్దయ్యాయి
“మాకు జూన్ వరకు 90 శాతం బుకింగ్‌లు ఖరారయ్యాయి. కానీ దాడి తర్వాత దాదాపు 80 శాతం బుకింగ్‌లు రద్దయ్యాయి” అని శ్రీనగర్‌కు చెందిన ఒక టూర్ ఆపరేటర్ ఇష్ఫాక్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్‌ల రద్దు కంటే, ఈ దాడి పర్యాటక రంగంపై చూపే దీర్ఘకాలిక ప్రభావం పైనే ఎక్కువ ఆందోళన నెలకొందని ఆయన అన్నారు.
తమ భద్రత గురించి తీవ్ర ఆందోళన
దాడి తర్వాత, కశ్మీర్‌కు వచ్చిన పర్యాటకులు తమ భద్రత గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన 40 మంది పర్యాటకుల బృందంలో ఆరుగురు భయంతో తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగారు. ఏళ్ల తరబడి శ్రమించి పర్యాటకులను కశ్మీర్ సందర్శనకు ఒప్పించామని, కానీ ఈ దాడి తర్వాత ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఒక క్యాబ్ ఆపరేటర్ శివమ్ వాపోయారు. తమ వ్యాపారం కోలుకోవడానికి దశాబ్దం పట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల తర్వాత జరిగిన ఈ దాడితో పర్యాటక రంగం భారీ నష్టాన్ని చవిచూస్తుందని ప్రముఖ హోటల్ యజమాని ముస్తాక్ ఛాయా తెలిపారు.

Read Also: Amit Shah: ఉగ్రవాదుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to Kashmir Tourists canceling tours

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.