📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

త్రిభాషా సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు: స్టాలిన్‌

Author Icon By Vanipushpa
Updated: March 11, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్రిభాషా సిద్ధాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాషా సిద్దాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. నాగ్‌పూర్‌ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేసిందన్నారు. పార్లమెంట్‌లో త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని స్టాలిన్‌ అభినందించారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. తమిళనాడు ఎంపీలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, చేసిన వ్యాఖ్యలను స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు.


పార్లమెంట్‌ ఆవరణలో డీఎంకే ఎంపీలు ఆందోళన
మరోవైపు త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టారు. తమిళనాడును అవమానించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్లదుస్తులు ధరించి డీఎంకే ఎంపీలు ఆందోళన చేశారు. అయితే డీఎంకే ఎంపీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. డీఎంకేలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయని, అందుకే ఈవిషయం నుంచి దృష్టి మరల్చడానికి త్రిభాషా వ్యతిరేక ఉద్యమానికి తెరపైకి తెచ్చారని విమర్శించారు. కొత్త విద్యా విధానంపై డీఎంకే మాట మార్చిందని , ఆ పార్టీ ఎంపీలు అనాగరికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపారు . తాము ముమ్మాటికి త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకమన్నారు ఎంపీ కనిమొళి.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News stalin Telugu News online Telugu News Paper Telugu News Today There is no point in implementing the three-language principle Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.