📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

Author Icon By Vanipushpa
Updated: February 26, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు జామునాటి మొదటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరమశివుడిని దర్శించుకుంటోన్నారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభ మేళాకు నేడు చివరి రోజు. నేటితో కుంభమేళాకు తెర పడబోతోంది. చివరి రోజు కావడంతో పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ క్రిక్కిరిసిపోతోంది.

అమృత్ స్నాన పర్వదినం

మహా శివరాత్రి నాడు కుంభమేళాలో పుణ్యస్నానాలను ఆచరించడానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీన్ని అమృత్ స్నాన్‌గా పరిగణిస్తారు. మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమల్లో కోట్లాదిమంది అమృత్ స్నాన్ ఆచరించారు. చివరిగా మహా శివరాత్రి నాటి అమృత్ స్నాన్ ఆచరించడానికి కోట్లాదిమంది ప్రయాగ్‌రాజ్‌కు వస్తోన్నారు. ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లను దాటింది కూడా. మంగళవారం నాటికి 65 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భ

ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. గోరఖ్‌పూర్ ఆలయంలో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఈ తెల్లవారు జామునే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంట్రోల్ రూమ్‌కు వచ్చారు. మహా కుంభమేళా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా త్రివేణి సంగమం ఘాట్ల వద్ద పోలీస్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అశ్వదళాలను మోహరింపజేశారు. ఘాట్ల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. మరోవంక వారణాశిలోని కాశీ విశ్వనాథేశ్వరుడి ఆలయానికీ లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తోన్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The Kumbh Mela Today news uttara pradesh will end today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.