📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

వరుడి స్థానంలో ఇంకొకరు షాకైన వధువు..చివరికి ఏమైంది?

Author Icon By Vanipushpa
Updated: March 13, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వధువు కుటుంబం ఊహించని షాక్‌కు గురైంది. పెళ్లి చూపులకు వచ్చిన యువకుడి స్థానంలో పెళ్లి రోజున మరొకరు వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో జరిగిన ఈ ఘటన సినిమాను తలపించేలా ఉంది. థానే మిల్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, హరియాణాలోని పానీపట్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లిచూపుల్లో చూపించిన యువకుడి ఫొటో చూసి వధువు కుటుంబం ఒకే చెప్పింది.
కానీ, పెళ్లి రోజున మొదట చూపించిన యువకుడు కాకుండా మరో వ్యక్తి వరుడిగా వచ్చాడు!
ఊరేగింపుగా వచ్చి పెళ్లి మండపానికి అడుగు పెట్టే వరకూ ఎవరికీ ఈ విషయం అర్థం కాలేదు.


వధువు కుటుంబానికి అర్థమైన మోసం
వధువు కుటుంబం, బంధువులు అసలు వరుడు కాకుండా ఇంకొకరు వచ్చిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మధ్యవర్తి రిసు మోసం చేసిందని వారు గ్రహించారు.
వెంటనే ఆమెను నిలదీశారు.
విషయం గ్రామ సర్పంచ్‌ వరకు వెళ్లింది.
చివరికి పోలీసులకు సమాచారం అందించడంతో అరెస్టులు జరిగాయి. పోలీసులు విచారణలో బయటపెట్టిన నిజాలు. థానే మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి రాజీవ్ సింగ్ మాట్లాడుతూ, ఇది నకిలీ మ్యారేజ్‌ బ్రోకర్ల మోసం కావొచ్చని చెప్పారు. సంబంధం కుదిరినట్లు నటించి, అమ్మాయి కుటుంబం నుంచి డబ్బు, బంగారం తీసుకుని పారిపోతున్నట్లు గుర్తించారు. ఇందులో పవన్ కుమార్ (నకిలీ వరుడు), మధ్యవర్తి రిసు, ఆమె భర్త అజయ్, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మోసపోయే కుటుంబాలకు పోలీసుల సూచనలు
పోలీసులు ఇలాంటి మోసాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వరుడు, అతడి కుటుంబం, నేపథ్యం గురించి పూర్తిగా సమాచారం సేకరించాలి. అధికారిక ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులు చెక్ చేయడం చాలా ముఖ్యం. వివాహ సంబంధాల పేరుతో డబ్బు ఇవ్వడం, విలువైన వస్తువులు అప్పగించడం ప్రమాదకరం. ఈ ఘటనతో నకిలీ మ్యారేజ్ బ్రోకర్ల మోసాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కుటుంబాలు ఇటువంటి మోసాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసుల సహాయం తీసుకోవడం మంచిది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News shocked bride Telugu News online Telugu News Paper Telugu News Today The groom was replaced by another Today news Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.