📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Narendra Modi:నేడు జాతికి మోదీ అంకితం చేయనున్న ఎతైన రైల్వే ప్రాజెక్ట్

Author Icon By Anusha
Updated: April 15, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం మరో వినూత్న ఘట్టానికి సిద్దమవుతోంది.ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీన దీనికి ప్రారంభించనున్నారు. జాతికి అంకితం చేయనున్నారు. తొలి రోజు- రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.జమ్మూ కాశ్మీర్‌లో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లాను అనుసంధానిస్తూ నిర్మించిన రైల్వే లింక్ బ్రిడ్జి ఇది. చీనాబ్ నదిపై నిర్మితమైంది. దీని మొత్తం పొడవు 272 కిలోమీటర్లు. ఇందులో చిట్టచివరిదై కాట్రా- సంగల్దాన్ స్ట్రెచ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రులు, ఉన్నతాధికారులు, అలాగే ఈ అద్భుత నిర్మాణానికి తోడ్పడిన ఇంజినీర్లు హాజరవుతారు. అనంతరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపనున్నారు.కాట్రా మీదుగా న్యూఢిల్లీ- జమ్మూ కాశ్మీర్‌ మధ్య నేరుగా రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చినట్టవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన చారిత్రాత్మక వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించే భక్తులకు రవాణా వసతిని మెరుగుపర్చినట్టవుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 43,780 కోట్ల రూపాయలు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా సెక్షన్ మధ్య ఉండే మొత్తం స్టేషన్ల సంఖ్య 31. ఈ మార్గంలో 36 టన్నెల్స్, ఏకంగా 943 వంతెనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం రోజున రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఒకటి శ్రీనగర్ నుండి- కాట్రా, ఇంకొకటి కాట్రా నుండి శ్రీనగర్‌కు నడుస్తుంది. ఇదొక ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ రైల్ లింక్ ఎత్తు 369 మీటర్లు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా ఎక్కువ. అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన రైల్వే ఆర్చ్ వంతెన ఇదొక్కటే. ప్రపంచంలో మరెక్కడా ఇంత ఎత్తులో రూపుదిద్దుకున్న వంతెన మరొకటి లేదు.

టన్నుల స్టీల్‌

గంటకు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగల సామర్థ్యం దీనికి ఉంది. దీని నిర్మాణంలో దాదాపు 30,000 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను ఉపయోగించారు. భూకంపాలకు సంభవించడానికి అనుకూల ప్రాంతంగా భావించే ఫాల్ట్ జోన్ దీని పరిధిలోకి వస్తుంది. భూకంపాలపరంగా చాలా సున్నితమై ప్రాంతం అది. వాటికి సైతం తట్టుకుంటుందని రైల్వే బోర్డు వెల్లడించింది.

ఐఫిల్ టవర్

ఈ వంతెన ప్రారంభం దేశానికి మెరుగైన కనెక్టివిటీని, ఆర్థిక వృద్ధిని, మరియు సమాజాన్ని సమగ్రంగా కలిపే అవకాశాలను అందించనుంది.సీనియర్ రైల్వే అధికారి మాట్లాడుతూ, “ఈ వంతెన నిర్మాణ లక్షణాల గురించి మాట్లాడితే దీని ఎత్తు 369 మీటర్లు. ఇది ప్యారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. ఈ వంతెన 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది” అని వివరించారు.ఇది పూర్తిగా స్టీల్‌తో నిర్మించిన వంతెన.

Read Also: Neela Rajendra : నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొల‌గింపు

#ChenabBridge #IndianRailways #PMModi #vandebharat #WorldsHighestRailwayBridge Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.