ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా చివరకు భారత్ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. ముంబై (Mumbai) లో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా, దేశంలో మొట్టమొదటి కారును విక్రయించింది.
మొదటి టెస్లా కారు గౌరవం మహారాష్ట్ర మంత్రికి
భారత్‌లో టెస్లా డెలివరీ చేసిన తొలి కారు గౌరవం మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్ నాయక్‌కు దక్కింది. ముంబైలోని ‘టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్’ (Tesla Experience Center)వద్ద ఆయన తెలుపు రంగు ‘మోడల్ వై’ కారు తాళాలను స్వీకరించారు.

వినూత్న నిర్ణయం
ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్ సర్ నాయక్ మాట్లాడుతూ, “దేశంలో తొలి టెస్లా కారును అందుకోవడం గర్వకారణం. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతోనే ఈ కారు కొనుగోలు చేశాను” అని తెలిపారు. టెస్లా వాహనాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కొంతవరకైనా మేలు జరుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
చైనా తయారీ టెస్లా వాహనాలు భారత్‌కు దిగుమతి
ప్రస్తుతం టెస్లా సంస్థ చైనాలోని షాంఘై ప్లాంట్‌లో తయారైన వాహనాలను భారత్‌కు దిగుమతి చేస్తోంది. ఇదే క్రమంలో, భారత మార్కెట్‌ను పరీక్షిస్తూ ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే టెస్లా కంపెనీ భారత్‌లో ప్లాంట్ స్థాపించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. స్థానిక తయారీ ప్రారంభమైతే, టెస్లా కార్ల ధరలు మరింత స్నేహపూర్వకంగా మారే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: