हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Dogs-వ్యక్తిపై వీధికుక్కల దాడి.. కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

Pooja
Telugu News: Dogs-వ్యక్తిపై వీధికుక్కల దాడి.. కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

Dogs: దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం, వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయించి తిరిగి అదే పాంతాల్లో వదిలిపెట్టాలని శుక్రవారం ఉన్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ వీధి కుక్కల బారినపడి పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో సుప్రీంకోర్టు ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలకు ప్రత్యేక షెల్టర్లలో ఉంచాలని ఆదేశించింది. తాజాగా ఓ వ్యక్తిని కుక్కలు దాడికి పాల్పడాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Dogs-వ్యక్తిపై వీధికుక్కల దాడి.. కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
Dogs-వ్యక్తిపై వీధికుక్కల దాడి.. కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

పనికి వెళ్తున్న వ్యక్తిపై కుక్కల దాడి

మహారాష్ట్రంలోని(Maharastra) పింప్రి-చించవాడలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తి పనికి వెళ్తున్నాడు. ఇంతలో ఏడు వీధి కుక్కలు ఒక్కసారిగా ఆ వ్యక్తిపై దాడికి తెగబడ్డాయి. తొలుత భయపడ్డ సదరు వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కుక్కలు దాడి చేయడంతో సదరు వ్యక్తి చేతికి దొరికిన ఓ చెక్క దుంగతో వాటిని తరిమికొట్టాడు. దాడితో అతడు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కల బెడద తమ వీధులలో ఎక్కువగా అయిందని, వెంటనే వీటిని అరికట్టాలని మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. బాధితుడి అరుపులు విన్న స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రావడంతో కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. ఓ బైక్ను వాటికి అడ్డుగా పెట్టి, చెక్కసాయంతో తనను తాను కాపాడుకున్నట్లు సదరు వ్యక్తి చెప్పారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

సుప్రీంకోర్టు వీధి కుక్కలపై ఏ ఆదేశాలు ఇచ్చింది?
వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించి, టీకాలు వేసి తిరిగి అదే ప్రాంతాల్లో వదలాలని ఆదేశించింది. ప్రమాదకరమైన కుక్కలను ప్రత్యేక షెల్టర్లలో ఉంచాలని కూడా పేర్కొంది.

3. కుక్కలు దాడి చేస్తే వెంటనే ఏం చేయాలి?
శాంతంగా ఉండి, చేతికి దొరికిన వస్తువుతో వాటిని తరిమివేయాలి. పెద్దగా అరుస్తూ, కుక్కల కళ్లలోకి నేరుగా చూడకుండా జాగ్రత్తపడాలి. వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-today-gold-rates-festival-time-even-if-gold-decreases/today-gold-rate/534893/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870