Hero Ajith Kumar : మరోసారి తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు ప్రమాదం

Read Time:  1 min
Tamil star hero Ajith car gets into an accident once again
Tamil star hero Ajith car gets into an accident once again
FONT SIZE
GET APP

Hero Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. కార్ రేస్ సమయంలో ట్రాక్‌పై ఆయన నడిపిన కారు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా – ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో అజిత్ తాజాగా పాల్గొన్నారు. రేస్ సమయంలో ఆయన నడుపుతున్న కారు కంట్రోల్ తప్పి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది. ప్రమాదం నుంచి అజిత్ సురక్షితంగా బయటపడడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/SUNSFRIDAY/status/1913485414884843983

వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది.

రేసింగ్ సమయంలో ఇంతకు ముందు కూడా హీరో అజిత్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈయన నడుపుతున్న వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇక, జనవరిలోనూ దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా.. ఆయన కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి సైతం ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పోర్చుగల్‌లో జరిగిన కార్ రేస్ పోటీల్లో అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం

ఇక.. సినిమాల విషయానికొస్తే.. అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తాజాగా రూ.200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. మూవీలో అజిత్ సరసన త్రిష నటించగా.. అర్జున్‌దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.

Read Also:  అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా పై కల్యాణ్ రామ్ స్పందన

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.