ఒక అమ్మయి ఒక అబ్బాయి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ ప్రేమ కొన్నిసార్లు పెళ్లివరకు నడిపిస్తుంది లేదా మధ్యలోనే ఆగిపోతుంది. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ నిజమైనదా నకిలీదా అని చెప్పడం కూడా కష్టమే. కానీ తన ప్రేమ భాగస్వామి ప్రవర్తనను బట్టి ఇట్టే గ్రహించవచ్చు. ప్రేమించుకున్నప్పుడు అన్నీ కరెక్టుగానే కనిపిస్తాయి. కానీ ఆ ప్రేమ ద్వేషంగా మారితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. తమిళనాడులో ఓ ప్రేమికుల మధ్య ఇదే జరిగింది.
Read Also: Train Accident: ఏపీలో రైలు ప్రమాదం ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
అత్యాచారం అంటూ ప్రియురాలు కేసు
తమిళనాడు-తిరునెల్వేలికి (Tamil Nadu) చెందిన దేవా విజయ్ తాను కాలేజీ రోజుల నుండి 9 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధంలో ఉండి, తర్వాత పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు ప్రియుడు దేవా విజయ్.
క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు: హైకోర్టు
దీనిపై విచారణ చేసిన మద్రాసు హైకోర్టు (Madras High Court) విజయ్ తన ప్రియురాలిని మోసం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇద్దరూ ప్రేమలో పడి, శారీరకంగా కలిశాక సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానిచ్చింది. ఇద్దరి మధ్య శారీరక బంధం ప్రేమ వల్ల ఏర్పడిందా, వివాహం కోసం చూశారా, కేవలం ఆనందం కోసమే జరిగిందా అనేది వారికి మాత్రమే తెలుసంటూ, ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యమంటూ కేసును మద్రాసు హైకోర్టు కొట్టి వేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: