Tamil Nadu Elections 2026: దక్షిణ భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆదివారం తెరలేపింది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించారు. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో తమిళనాడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, దీనితో ప్రధాన పార్టీలైన DMK, AIADMK, మరియు పాగా వేయాలని చూస్తున్న BJP, ఇతర కూటముల మధ్య పోరు ముదిరింది.
Read Also: West Bengal Election Schedule 2026: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!
రికార్డు స్థాయిలో యువ ఓటర్లు
ఈసారి తమిళనాడు ఎన్నికల్లో యువతరం నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. రాష్ట్రంలో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 12.51 లక్షల మంది 18-19 ఏళ్ల వయసున్న నూతన ఓటర్లు కావడం విశేషం. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడులోనే అత్యధికంగా యువ ఓటర్లు నమోదు కావడం గమనార్హం. వీరితో పాటు 7,617 మంది ట్రాన్స్‌జెండర్లు, 4.63 లక్షల మంది దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సజావుగా పోలింగ్.. ప్రత్యేక ఏర్పాట్లు
ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 75,032 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. రద్దీని తగ్గించేందుకు ప్రతి బూత్‌లో గరిష్ఠంగా 1,200 మందికి మాత్రమే అనుమతిని ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలలో కూడా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. 85 ఏళ్లు పైబడిన 3.99 లక్షల మంది వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
Tamil Nadu Elections 2026: రిజర్వేషన్లు మరియు గడువు
రాష్ట్రంలోని 234 స్థానాల్లో 44 స్థానాలను ఎస్సీలకు, 2 స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసిన అనంతరం, మే 4న ఫలితాలు ప్రకటించి, మే 6 నాటికి పూర్తి ఎన్నికల ప్రక్రియను ముగించనున్నారు. ఇప్పటికే అధికార డీఎంకే సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకర్షిస్తుండగా, అన్నామలై నేతృత్వంలోని బీజేపీ మార్పు నినాదంతో దూసుకుపోతోంది. ఈ హోరాహోరీ పోరులో తమిళ తంబీలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: