ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ట్విట్టర్ వీడియో వివాదం
భావ ప్రకటనా స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య దేశంలో ఒక భాగమని.. దాన్ని పరిరక్షించడం కోర్టుల బాధ్యత అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్య్రం అనేది ప్రజాస్వామ్య సమాజంలో ఒక అంతర్భాగమని.. దాన్ని రక్షించడం కోర్టుల విధి అని స్పష్టం చేసింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, 2024 డిసెంబర్‌లో తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ఇమ్రాన్ పెళ్లి వేడుకకు హాజరై, వేదికపై నడుస్తూ ఉంటే ఆయనపై పూల వర్షం కురిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో ఓ పద్యం వినిపించగా, ఆ పద్యంలోని కొన్ని పదాలు వివాదాస్పదంగా మారాయి.
పద్యంలోని పదాలు మత విశ్వాసాలు, జాతి ఐక్యతకు హానికరమైనవిగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా, ఇమ్రాన్ గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఈ కేసును కొట్టివేయాలని కోరారు.
గుజరాత్ కోర్టు ఇమ్రాన్ పిటిషన్ కొట్టివేసిన తీర్పు
గుజరాత్ కోర్టు ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి పిటిషన్‌ను విచారించిన తర్వాత, కేసును కొట్టివేసింది. కోర్టు ఈ సందర్భంగా ఇమ్రాన్ పై ఉన్న నేరారోపణలను రద్దు చేయాలని నిరాకరించింది. ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజా విచారణలో, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మరియు జస్టిస్ ఉజ్జ్ భుమాన్ నేతృత్వంలోని ధర్మాసనం, గుజరాత్ కోర్టు నిర్ణయంపై విచారణ ప్రారంభించింది.
విచారణలో, ధర్మాసనం వాక్ స్వాతంత్య్రం ప్రాధాన్యతను వివరించింది. “కవిత్యం, సినిమా, నాటకాలు, కళలు, సాహిత్యం మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. దానిని అణచివేయడం సరైనది కాదు” అని ధర్మాసనం పేర్కొంది.