📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Supreme Court: కరుణానిధి విగ్రహ ఏర్పాటును తిరస్కరించిన సుప్రీంకోర్టు

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి (M. Karunanidhi) విగ్రహ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టు స్పష్టమైన, కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిధులను ఉపయోగించి రాజకీయ నాయకుల కీర్తిని ప్రజల ముందుకు చాటే ప్రయత్నాలు అనుచితమని, పౌరుల డబ్బును ఈ విధంగా ఉపయోగించడం సముచితం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది.

ఈ క్రమంలోనే ప్రజల సొమ్ముతో కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహించింది. ఈ సందర్భంగా విగ్రహాల ఏర్పాటుపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు..

Supreme Court

ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని

ఈ వ్యవహారంలో విగ్రహం ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు (Madras High Court) ను ఆశ్రయించాలని స్టాలిన్ సర్కార్‌కు తెలిపింది.తిరునల్వేలి జిల్లాలోని ప్రధాన రహదారిపై వల్లీయూర్ డైలీ వెజిటేబుల్ మార్కెట్ మెయిన్ గేట్ వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం (Bronze statue of Karunanidhi) తోపాటు.. నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును స్టాలిన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దాన్ని తీవ్రంగా ఖండించింది.

కరుణానిధి విగ్రహం పెట్టడం సరైనదేనా ?

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News government criticism latest news Madras High Court Public Funds Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.