📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Supreme Court: ఆమె ఇష్టంతోనే అతడితో వెళ్ళింది.. సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: May 29, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుప్రీం కోర్టు అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా 9 నెలలుగా నిందితుడు జైల్లో ఉన్నప్పటికీ అభియోగాలు నమోదు చేయకపోవడాన్ని జస్టిస్ బి.వి నాగర(B.V. Nagaratna)త్న, జస్టిస్ సతీశ్ చంద్ర ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. బాధితురాలు 40 ఏళ్ల వివాహిత అని గుర్తు చేస్తూనే ఆమేమీ చిన్న పిల్ల కాదని, ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేరని వ్యాఖ్యానించింది. అంటే ఈ కేసులో ఆమె తప్పు కూడా ఉందని, కావాలనే బాధితురాలు నిందితుడి వెంట వెళ్లిందని చెప్పుకొచ్చింది.

వివరాలు

40 ఏళ్ల వయసు కల్గిన ఓ మహిళ దుస్తుల వ్యాపారం చేస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి 2021లో ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను కలిసింది. వ్యాపార ప్రకటన చేయమని అతడిని కోరగా ఐఫోన్ కనిస్తే చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె అతడికి ఐఫోన్(iPhone) కొనిచ్చింది. కానీ అతడు దీన్ని అమ్మాలని చూడగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఫోన్ అమ్మగా వచ్చిన డబ్బులు అన్నీ ఆమెకే ఇచ్చేసి రూ.20 వేలు మాత్రం అతడు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చే నెపంతో జమ్మూ నుంచి నోయిడా(Noida)లోని ఆమె ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి వ్యాపార సంబంధ వీడియోల చిత్రీకరణ కోసం జమ్మూలోని అనేక ప్రదేశాల్లో తిరిగారు.ఈక్రమంలోనే అతడు ఆమెకు మత్తు కలిపిన మిఠాయిలు తినిపించి తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఆ సమయంలో తన నగ్న చిత్రాలు తీసుకుని రెండున్నరేళ్లపాటు వేధింపులకు గురి చేసినట్లు పేర్కొంది. అలాగే అనేక మార్లు బెదిరించి డబ్బులు కూడా గుంజాడని ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఇతడు అరెస్ట్ అయి 9 నెలల కావస్తున్నా బాధితురాలు అభియోగాలు నమోదు చేయలేదు. దీంతో నిందితుడు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం విచారణ చేపట్టింది.

Supreme Court:

అభ్యంతరం

బాధితురాలిపై ఈక్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బి.వి నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర ధర్మాసనం ప్రశ్నించింది. బాధితురాలు 40 ఏళ్ల వివాహిత అని చెబుతూనే ఆమేమీ చిన్న పిల్ల కాదని వ్యాఖ్యానించింది. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేరని మహిళ కావాలనే యువకుడితో వెళ్లిందని చెప్పింది. ఇద్దరూ కలిసే జమ్మూకు 7 సార్లు వెళ్లారని ఇందుకు మహిళ భర్త కూడా అభ్యంతరం తెలపలేదని వ్యాఖ్యానించింది. ఇలాంటప్పుడు ఏ ఆధారాలతో యువకుడిపై ఐపీసీ సెక్షన్(IPC Section) 376 కింద కేసు పెట్టారని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. అలాగే నిందితుడిని ట్రయల్ కోర్టులో ప్రవేశ పెట్టి, నిబంధనలకు లోబడి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also : Naveen Kumar: షార్ప్‌షూటర్ నవీన్ ఎన్‌కౌంటర్ లో హతం

#InterimBail #LegalUpdate #SocialMediaInfluencer #RapeCaseIndia #SupremeCourtIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.