📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Coexistence: సహజీవనం అత్యాచారంగా పరిగణించలేం: సుప్రీం కోర్ట్

Author Icon By Anusha
Updated: May 27, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోకుండానే సహజీవనం పేరుతో కలిసి జీవిస్తున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత వీరి మధ్య విబేధాలు వస్తే కొందరు అమ్మాయిలు లైట్ తీస్కోగా, మరికొందరు మాత్రం తమను పెళ్లి చేసుకుంటామని మాయ మాటలు చెప్పి మోసం చేశారంటూ కోర్టులను, పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అత్యాచారం కేసులు పెట్టి అబ్బాయిలకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్లకు షాక్ ఇస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా ఇలాంటి కేసులు అత్యాచారం కేసు కిందకు రావంటూ, వీటిని ఆ కేసుల కింద అస్సలే పరిగణించలేమంటూ వ్యాఖ్యానించింది.పూర్తి వివరాలు,మహారాష్ట్ర(Maharashtra)లోని సతారాకు చెందిన ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయింది. కానీ మరో వ్యక్తితో ఆమె ప్రేమలో పడగా భర్తను వదిలేసి ప్రియుడి చెంత చేరింది. ముఖ్యంగా 2022 జులై నుంచి 2023 వరకు అతడితోనే సహజీవనం చేసింది. ఈ మధ్య కాలంలోనే భర్త, కుల పెద్దలకు చెప్పి పంచాయితీ పెట్టించగా అతడితో విడాకులు తీసుకుంది. మరోవైపు ప్రేమికుడు కూడా ఆమెకు బ్రేకప్ చెప్పాడు. దీంతో సదరు మహిళ ప్రియుడిపై ట్రయల్ కోర్టు(Trial court)లో ఫిర్యాదు చేసింది.పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను బలవంతంగా శారీరంగా వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆమె ప్రియుడు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. బలవంతంగా ఏమీ తాను మహిళతో బంధం సాగించలేదని ఇద్దరి ఇష్ట పూర్వకంగానే కలిసున్నామని చెప్పాడు.

ఆరోపణలు

ఆగస్టు 2023లో ట్రయల్ కోర్టు అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించడంతో సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. అయితే ముందుస్తు సమాచారం లేకుండా సదరు మహిళ అతడి సొంత గ్రామానికి వెళ్లటాన్ని కూడా ధర్మాసనం తప్పు పట్టింది. అతడు దూరమైపోతాడన్న బాధ, భయంతోనే ఆమె అత్యాచార ఆరోపణలు చేసినట్లుగా గుర్తించింది. 25 ఏళ్ల వయసు కల్గిన నిందితుడి జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసిన జంట ఆపై విడిపోవడం క్రిమినల్ కేసు(Criminal case) దాఖలుకు కారణం కారాదని తేల్చి చెప్పింది.

Coexistence: సహజీవనం అత్యాచారంగా పరిగణించలేం: సుప్రీం కోర్ట్

నిందితుడిని

ఇలాంటి కేసులు న్యాయస్థానాలపై భారం మోపడమే కాకుండా, నిందితుల జీవితంపై కూడా తీరని మచ్చలుగా ఉండిపోతాయని జస్టిస్ బి.వి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యంగా పెళ్లి చేసుకుంటాననే మోసపూరిత వాగ్దానంతో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ నిందితుడిని నిర్దోషిగా తేల్చింది. ఎఫ్ఐఆర్‌(FIR)లో పేర్కొన్న ఆరోపణలు నిజమే అయినప్పటికీ ఆమెకు ఇష్టం లేకుండా దీర్ఘకాలంగా అతడు ఆమెతో సహజీవనం చేసినట్లు భావించలేమని అభిప్రాయపడింది. ఇప్పటికే ఇలాంటి చాలా కేసులు వస్తున్నాయని చట్ట నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయని చాలా కాలంగా న్యాయస్థానం హెచ్చరిస్తూనే వస్తోంది.

Read Also : PM Shahbaz Sharif: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం: పాక్ ప్రధాని

#FalseRapeAllegations #LegalAwareness #LiveInRelationships #SupremeCourtVerdict Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.