📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Sultana Begum: ఎర్రకోట వివాదం సుల్తానా బేగంకి సుప్రీంకోర్టు లో లభించని ఊరట

Author Icon By Anusha
Updated: May 6, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మొఘల్ సామ్రాజ్య చివరి పాలకుడు బహదూర్ షా జాఫర్ మునిమనవడైన మీర్జా మహమ్మద్ బేదర్ భక్త్ భార్య సుల్తానా బేగం, ఎర్రకోటపై తమ కుటుంబానికి వారసత్వ హక్కులు ఉన్నాయని వాదిస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమె వాదనను తోసిపుచ్చింది. “మీరు ఎర్రకోటను అడుగుతున్నారు, ఇదే ప్రాతిపదికన ఫతేపూర్ సిక్రీ, తాజ్‌మహల్ వంటి వాటిని కూడా అడగవచ్చు కదా? ఈ పిటిషన్‌లో వాదించడానికి ఏముంది?” అని ప్రశ్నిస్తూ, పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.సుల్తానా బేగం ప్రస్తుతం కోల్‌కతాలోని ఒక మురికివాడలో నివసిస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చే కొద్దిపాటి పింఛన్‌తో జీవనం సాగిస్తున్నారు. తన భర్త మీర్జా మహమ్మద్ బేదర్ భక్త్‌ను 1960లో బహదూర్ షా జాఫర్ వారసుడిగా ప్రభుత్వం గుర్తించిందని, ఆయన మరణానంతరం 1980 నుంచి ఆ పింఛన్ తనకు బదిలీ అయిందని ఆమె తెలిపారు. అయితే, ఆ పింఛన్ డబ్బులు జీవించడానికి ఏమాత్రం సరిపోవడం లేదని, తమ పూర్వీకుల ఆస్తి అయిన ఎర్రకోటను ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుందని, దానిని తిరిగి ఇప్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

ఆవేదన వ్యక్తం

సుల్తానా బేగం 2021లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. బ్రిటిష్ ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకుని సుమారు 150 ఏళ్లు గడిచిన తర్వాత, ఇంత ఆలస్యంగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తీవ్ర జాప్యం జరిగిందన్న కారణంతో అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. అయినప్పటికీ, తన పోరాటాన్ని ఆపని సుల్తానా బేగం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సుల్తానా బేగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ప్రత్యేకంగా ఎర్రకోట అని అడగలేదు, బహదూర్ షా జాఫర్ ఇంటిని ఇప్పించమని మాత్రమే కోరాను. అది ఎర్రకోటో, జాఫర్ మహలో, ఫతేపూర్ సిక్రీనో ప్రభుత్వానికే తెలియాలి. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశించాను, కానీ ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడిక నేను ఎక్కడికి వెళ్లాలి? భిక్షమెత్తుకోవాలా?” అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రభుత్వం

ఒకప్పుడు అపార సంపదతో ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా వెలుగొందిన మొఘల్ సామ్రాజ్యానికి బహదూర్ షా జాఫర్ చివరి చక్రవర్తి. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆయన ఒక వర్గానికి నాయకత్వం వహించారు. అయితే, బ్రిటిష్ వారి చేతిలో ఓటమి పాలై, రంగూన్‌కు ప్రాణభయంతో పారిపోయారు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆయన ఆస్తులను, ఎర్రకోటను స్వాధీనం చేసుకుంది. కాలక్రమేణా, మొఘల్ వారసుల కుటుంబం పేదరికంలోకి జారిపోయింది. ఒకనాటి వైభవాన్ని కోల్పోయి, నేడు సుల్తానా బేగం వంటి వారసులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు.

Read Also :Central Government: దేశ భద్రత పై కేంద్రం కీలక నిర్ణయం!

#BahadurShahZafar #HistoricMonuments #MughalDynasty #RedFort #SupremeCourt Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.