📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

CM Stalin: కేంద్రంపై స్టాలిన్ పోరాటం.. కోర్టుకెక్కిన వైనం

Author Icon By Anusha
Updated: May 21, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్రం ప్రభుత్వం తమ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు చేయడం లేదన్న కారణంతో  తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్, ప్రాంతీయ భాషతో పాటు మూడో భాషను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నమని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తూ, ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, భారతీయ భాషల పునరుద్ధరణకే త్రిభాషా సూత్రమని కేంద్రం చెబుతోంది.పాఠశాల విద్య కోసం ఉద్దేశించిన సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని గత ఏడాది ఫిబ్రవరి 16న జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు(Project Approval Board) సమావేశంలో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందని గుర్తుచేసింది. ఈ పథకం కింద రూ.3,585.99 కోట్ల కేటాయింపు జరిగిందని తెలిపింది. ఇందులో 60:40 నిష్పత్తి ప్రకారం, కేంద్రం వాటా రూ.2,151 కోట్లు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని తెలిపింది.

CM Stalin: కేంద్రంపై స్టాలిన్ పోరాటం.. కోర్టుకెక్కిన వైనం

విద్యా విధానం

అయితే, ఈ మొత్తంలో ఒక్క వాయిదా కూడా కేంద్రం విడుదల చేయలేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. “జాతీయ విద్యా విధానం, పీఎం శ్రీ పాఠశాలల పథకాల అమలుతో సమగ్ర శిక్ష నిధుల విడుదలను కేంద్రం ముడిపెట్టడమే నిధులు విడుదల చేయకపోవడానికి స్పష్టమైన కారణం. ఈ రెండు పథకాలు వేర్వేరు” అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేలా తమపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. నిధుల నిలిపివేత సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానంలో జోక్యం చేసుకోవడమేనని డీఎంకే ప్రభుత్వం వాదించింది.

Read Also: Asiatic lions : గుజరాత్‌లో ఆసియా సింహాల సంతతి పెరిగింది .. గుజరాత్‌ సీఎం

#LanguagePolicy #NEP2020 #TamilNadu #ThreeLanguageFormula Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.