📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: నాకు అవకాశం ఇవ్వండి.. మహిళా క్రికెట్‌కు సిద్ధం: అనయ బంగర్

Author Icon By Anusha
Updated: June 20, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. గతంలో ఆర్యన్ బంగర్గా గుర్తింపు పొందిన అనయ.. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ మహిళ గా తన కొత్త జీవితాన్ని స్వీకరించింది. అయితే కేవలం వ్యక్తిగత మార్పే కాకుండా, క్రీడా రంగం (Sports field) లోనూ తన స్థానం కోసం పోరాటం చేస్తోంది.ఐసీసీ, బీసీసీఐ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అనయ బంగర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ తాను మహిళల క్రికెట్‌కు అర్హురాలినని వెల్లడించింది. గతంలో ఆర్యన్ బంగర్‌గా పిలవబడిన అనయ బంగర్ (Anaya Bangar)తాను హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(హెచ్ఆర్టీ) తీసుకున్న తర్వాత ఒక అథ్లెట్‌గా తాను చేసిన ప్రయాణాన్ని పంచుకోవడంతో పాటు 8 పేజీల అథ్లెట్ టెస్టింగ్ నివేదికను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

నా ప్రయాణానికి

ఆ వీడియో సందేశంలో అనయ బంగర్ మాట్లాడుతూ తాను మహిళల క్రికెట్‌లో పాల్గొనేందుకు అర్హురాలినని అనయ పేర్కొన్నారు. ఒక ఏడాది పాటు హెచ్ఆర్టీ (HRT) పూర్తి చేసుకున్న తర్వాత మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీతో కలిసి ఈ పరీక్షలు చేయించుకున్నట్లు అనయ వెల్లడించారు. ఈ పరీక్షల్లో భాగంగా తన కండరాల బలం, ఓర్పు, గ్లూకోజ్, ఆక్సిజన్ స్థాయిలను సిస్‌జెండర్ మహిళా అథ్లెట్ల (female athletes) తో పోల్చి చూశారని, ఆయా పారామీటర్లు సిస్‌జెండర్ మహిళా అథ్లెట్ల ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని పరీక్షా నివేదికలు తెలిపాయని ఆమె పేర్కొన్నారు.ఆ వీడియోలో అనయ మాట్లాడుతూ “మొట్టమొదటిసారికి ట్రాన్స్ ఉమెన్ అథ్లె‌ట్‌గా మారిన నా ప్రయాణానికి సంబంధించిన శాస్త్రీయ రిపోర్టులను అందరికీ చూపిస్తున్నాను. హార్మోన్ థెరపీ ప్రారంభించిన అనంతరం నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ రిపోర్టులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. ఈ రిపోర్టును బీసీసీఐ, ఐసీసీకి పంపిస్తున్నాను. 

క్రికెట్ ఆడేందుకు

ఇది కేవలం నిజాలను చెప్పడం గురించే. ఎవరు అంగీకరించినా, లేకపోయానా పరవాలేదు. థాంక్యూ” అంటూ అనయ బంగర్ చెప్పుకొచ్చింది. తన ఇన్‌స్టా పోస్ట్‌కు “సైన్స్ ప్రకారం నేను మహిళల క్రికెట్ ఆడేందుకు అర్హురాలిని. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ప్రపంచం ఈ నిజాన్ని వినడానికి సిద్ధంగా ఉందా?” అంటూ క్యాప్షన్ జోడించారు.ఇదిలా ఉండగా ప్రస్తుత నిబంధనల ప్రకారం ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లు (Transgender cricketers) మహిళల క్రికెట్లో పాల్గొనడానికి అవకాశం లేదు. వారిని క్రికెట్లోకి అనుమతించేది లేదంటూ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అనయ బంగర్ గతేడాది హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Read Also: IND vs ENG: 3-1 తేడాతో గెలవడం పక్కా : సచిన్ టెండూల్కర్

#AnayaBangar #CricketForAll #SupportTransAthletes #TransRightsInSports Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.