📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

South Central Railway: ఇకపై ఎవరైనా రైళ్లపై రాళ్ల దాడి చేస్తే జైలు శిక్ష తప్పదు

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ఇటీవల రైళ్లపై రాళ్లదాడుల ఘటనలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమైన తర్వాత అలాంటి ఘటనలు మరింత పెరిగాయి. ప్రయాణికుల రక్షణకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కానీ కొందరు ఆకతాయిలు రైళ్లపై రాళ్లు వేసి, ప్రమాద పరిస్థితులు సృష్టించడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది.ఏపీలో ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) పై ముగ్గురు యువకులు రాళ్లతో దాడి చేశారు,దీంతో రైల్వే అధికారులు మరోసారి హెచ్చరించారు. ఎవరైనా రైళ్లపై రాళ్ల దాడి చేసి రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్ అరుణ్‌కుమార్‌ జైన్‌ (Arun Kumar Jain) హెచ్చరించారు.

ఆస్తులకు నష్టం

ఎవరైనా రాళ్ల దాడికి పాల్పడినా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే 139లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 ప్రకారం రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని SCR జనరల్‌ మేనేజరు అరుణ్‌కుమార్‌ జైన్‌ హెచ్చరించారు. 2025 జనవరి నుంచి మే నెల వరకు 100 మందికిపైగా రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామన్నారు. ఈ మొత్తం కేసుల్లో 12 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించి ఒక నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మిగిలిన 11మందికి మాత్రం రూ.30,500 జరిమానా విధించినట్లు చెప్పారు.

South Central Railway

రైల్వేశాఖ

అలాగే ఎవరైనా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులు ఉంచినా నేరమే అన్నారు.అలా చేసిన 29 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.మరోవైపు రైల్వేశాఖ కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.ఈ మేరకు రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వీటిలో 100 మెము రైళ్లు, 50 నమో భారత్, 50 అమృత్‌ భారత్‌ రైళ్లు ఉన్నాయన్నారు. ఈ రైళ్లు అత్యాధునిక వసతులతో సిద్ధమయ్యాయి,వీటిని ఏ రూట్లలో కేటాయించారనేది క్లారిటీ లేదు. మెము రైళ్లకు గతంలో 8 నుంచి 12 కోచ్‌లు ఉంటే ఆ సంఖ్యను 16 నుంచి 20కు పెంచినట్లు తెలిపారు. అలాగే కొత్తగా 50 నమో భారత్ రైళ్లు తయారు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: Andhra Pradesh: రెండు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి

#ArunKumar jain #RailwaySafety #StonePelting #TrainAttack #vandebharat Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.