हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Sonam Raghuvanshi: తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్.. అన్నట్టుగానే చేసింది

Ramya
Sonam Raghuvanshi: తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్.. అన్నట్టుగానే చేసింది

ప్రేమకు అడ్డుపడ్డ పెళ్లి.. అనంతరం దారుణ హత్య

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ మర్డర్ కేసులో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్ (24) – రాజా రఘువంశీ (29)ల వివాహం మే 11న ఘనంగా జరిగింది. అయితే ఇది సామాన్య వివాహం కాదు. (Sonam Raghuvanshi) సోనమ్ తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని ముందే తన తల్లిని హెచ్చరించింది. ‘‘నాకు ఈ సంబంధం అంగీకారంలేదు. రాజ్ కుశ్వాహాను ప్రేమిస్తున్నాను. మీరు నాకు బలవంతంగా పెళ్లి చేస్తే దాని తాలూకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని ఆమె స్పష్టంగా చెప్పిందట. అయినా అమ్మ మాత్రం వినలేదు. కుటుంబ పరువు, కుల గౌరవం పేరుతో బలవంతంగా వివాహం చేయించేశారు. ఇదే అంశం తరువాత ఘోర దారుణానికి దారి తీసింది.

Sonam Raghuvanshi: తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్.. అన్నట్టుగానే చేసింది

తల్లిని బెదిరించిన ముద్దుల కుమార్తె

తన మాటలు పట్టించుకోకపోయిన తల్లిని (Sonam Raghuvanshi)సోనమ్ తీవ్రంగా హెచ్చరించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘‘ఆ మనిషిని (రాజా) నేను ఏం చేస్తానో చూడండి.. దాని ప్రభావం మీమీద కూడా ఉంటుంది’’ అంటూ బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాజ్ కుశ్వాహాతో సంబంధం గురించి బహిరంగంగా వెల్లడించినప్పటికీ, తల్లి ఒప్పుకోకపోవడంతో సోనమ్ మనసులో కోపం పెరిగిపోయింది. చివరికి బలవంతంగా రాజా రఘువంశీతో వివాహం జరిగాక, కేవలం 12 రోజుల్లోనే ఆమె భర్తను హత్య చేయించేసింది.

హనీమూన్‌కు వెళ్లి.. హత్యకు పాల్పడ్డారు

పెళ్లయిన తర్వాత, మే 23న రాజా, సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ ఓ హోమ్‌స్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిద్దరూ అదృశ్యమయ్యారు. మొదట దంపతులు కనపడటం లేదని కేసు నమోదు కాగా, జూన్ 2న రాజా మృతదేహం లభించడంతో ఈ కేసు దారుణమైన మలుపు తిరిగింది. విచారణలో సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది.

రాజా సోదరుడి వాంగ్మూలం కీలకం

ఈ ఘటనలో రాజా రఘువంశీ సోదరుడు విపిన్ ఇచ్చిన వాంగ్మూలం కేసును మరో కోణంలోకి మళ్లించింది. సోనమ్ గతంలో తల్లిని బెదిరించిన విషయాన్ని అతను పోలీసులకు వెల్లడించాడు. ‘‘ఈ పెళ్లి బలవంతంగా చేస్తున్నారని, దానికి తీవ్ర పరిణామాలుంటాయని సోనమ్ తన తల్లిని హెచ్చరించిన సంగతి మా కుటుంబానికి అప్పుడే తెలిసింది. కానీ అది ఇంత దారుణానికి దారితీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు’’ అంటూ విపిన్ చెప్పిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Read also: Faridabad: రైలు కింద తోసేసిన తండ్రి ఆ పై తాను ఆత్మహత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870