📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Sharmistha Panoli: నా కూతురిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరిన షర్మిష్ఠ తండ్రి

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోల్‌కతా పోలీసుల ఆరోపణలను లా విద్యార్థిని షర్మిష్ఠ పనోలి తండ్రి పృథ్వీరాజ్ పనోలి ఘాటుగా ఖండించారు. తాము పరారీలో లేమని, పోలీసుల ప్రధాన కార్యాలయం లాల్‌బజార్‌(Lalbazar)లోనే ఉన్నామని స్పష్టం చేశారు. ఇందుకు ఆధారంగా విజిటర్ స్లిప్పులను మీడియాకు చూపించారు. షర్మిష్ఠను గురుగ్రామ్‌లో అరెస్టు చేసిన అనంతరం కోల్‌కతా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియను అనుసరించామని, నిందితురాలికి పలుమార్లు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్(BNSS Section) 35 కింద నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని, కానీ ఆమె ప్రతిసారీ పరారీలో ఉన్నట్టు తేలిందని తెలిపారు. నిందితురాలు తన కుటుంబంతో సహా పరారీలో ఉండటంతో నోటీసులు అందించడం సాధ్యం కాలేదని, తదనంతరం కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొంది,చట్టప్రకారం గురుగ్రామ్‌లో పగటిపూట ఆమెను అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.

హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్

షర్మిష్ఠ తండ్రి పృథ్వీరాజ్(Prithviraj Panoli) పోలీసుల వాదన పూర్తిగా అవాస్తవమని, తప్పుడు సమాచారంతో కూడుకున్నదని ఆరోపించారు. పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ, మే 15న కోల్‌కతా పోలీసు హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్ జారీచేసిన రెండు ‘విజిటర్ స్లిప్పులను’ ఆయన ప్రదర్శించారు. ఆ స్లిప్పులలో తన కుమార్తె షర్మిష్ఠ పేరు, తన పేరుతో పాటు ఫోటోలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. గార్డెన్‌రీచ్ పోలీస్ స్టేషన్‌లో షర్మిష్ఠపై మే 15న ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, మే 17న అరెస్ట్ వారెంట్ జారీ కావడం గమనార్హం.కాగా,షర్మిష్ఠ మే 7న ఏదో పోస్ట్ చేసి, మే 8న డిలీట్ చేసింది. మే 15న ఉదయం సుమారు 10:30 గంటలకు నేను, షర్మిష్ఠ లాల్‌బజార్ పోలీస్ స్టేషన్‌(Lalbazar Police Station)లో ఉన్నాం. మే 17న ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే సీనియర్ అధికారి సెలవులో ఉన్నారని చెప్పారు. మే 18న రోజంతా నాతో టచ్‌లో ఉన్న హెడ్‌క్వార్టర్స్ పోలీస్ అధికారికి, ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు మెసేజ్‌లు పంపుతూనే ఉన్నాను” అని పృథ్వీరాజ్ వివరించారు. మే 17న వారెంట్ జారీ అయినప్పుడు కూడా తాను పోలీసులతోనే ఉన్నానని చెప్పారు. “పోలీసులు మా ఫ్లాట్‌కు రాలేదు. మా సొసైటీ సెక్యూరిటీ గార్డులను అడగవచ్చు. అక్కడ ఎంట్రీ ఉంటే తెలిసిపోతుంది కదా” అని అన్నారు. నోటీసులు పంపాలనుకుంటే వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపవచ్చని, తనకు అలాంటి నోటీసులేవీ అందలేదని ఆయన స్పష్టం చేశారు.

Sharmistha Panoli

ఆన్‌లైన్‌లో బెదిరింపులు

ఏడెనిమిది మంది వ్యక్తులు, తమ ఫ్లాట్‌కు తిరిగి వస్తున్నప్పుడు, తమ టవర్ చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించానని, దాంతో భయపడి తాను, షర్మిష్ఠ గురుగ్రామ్‌కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నామని పృథ్వీరాజ్ తెలిపారు. “ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఆన్‌లైన్‌లో బెదిరింపులు పెరగడంతో మేం భయపడ్డాం. నా కుమార్తెకు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. మేము గురుగ్రామ్(Gurugram) చేరేసరికి తెల్లవారుజామున మూడు గంటలైంది. ఎయిర్‌పోర్ట్ పక్కనే ఒక హోటల్ బుక్ చేసుకుని మే 20 నుంచి 30 వరకు నగరంలోనే ఉన్నాం” అని ఆయన వివరించారు. గురుగ్రామ్ నుంచి కూడా తాము కోల్‌కతా పోలీసు అధికారులతో టచ్‌లోనే ఉన్నామని, మే 22 నుంచి 29 మధ్య షర్మిష్ఠ అక్కడ ఒక ఇంటర్న్‌షిప్ కూడా చేసిందని ఆయన తెలిపారు.మేము మే 22న గురుగ్రామ్ వెళ్లాల్సి ఉండగా భయంతో మే 19నే వెళ్లిపోయాం. హఠాత్తుగా మే 30న పోలీసులు అక్కడికి వచ్చి, అరెస్ట్ వారెంట్ ఉందని, ఆమెను కోల్‌కతా తీసుకురావాలని చెప్పారు. కానీ మాకు ఏమీ చూపించలేదు. అరెస్టుకు గల కారణాలు కూడా మాతో పంచుకోలేదు” అని పృథ్వీరాజ్ ఆరోపించారు.

Read Also: Shashi Tharoor: అఖిలపక్ష బృందానికి శశిథరూర్ నాయకత్వంలో అమెరికా పయనం

#FalseAccusations #KolkataPolice #PoliceClarification #PrithvirajPanoli #SharmisthaPanoli Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.