మంగళవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో భారత జట్టు మరోసారి తన ఘనతను చాటుకుంది. రోహిత్ శర్మ సేన ప్రదర్శనపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
షమా మహమ్మద్ స్పందన
విజయాన్ని పురస్కరించుకుని, ఇటీవల భారత కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ కూడా స్పందించారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆమె భారత జట్టును అభినందించారు. “ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించిన టీమిండియాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కీలక మ్యాచ్‌లో 84 పరుగులతో మెరిసిన విరాట్ కోహ్లీ ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్లలో వెయ్యి పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలవడం గర్వించదగ్గ విషయం” అంటూ షమా ట్వీట్ చేశారు.
ఫైనల్
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో మరొక ఆసక్తికర పోరు ఇవాళ లాహోర్ వేదికగా జరగనుంది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు, మార్చి 9న దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. టీమిండియా ఫైనల్‌కి చేరుకోవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు మరో ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆసీస్‌పై విజయం
ఒవరాల్‌గా, ఆసీస్‌పై భారత జట్టు ఈ విజయంతో తన దృష్టిని ఇప్పుడు ఫైనల్‌పై కేంద్రీకరించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ, రోహిత్, బుమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. అభిమానులు ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ, భారత జట్టుకు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఫైనల్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనతో భారత్ ట్రోఫీ నెగ్గాలని ప్రతి భారత క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో బెన్ ద్వార్షిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. విరాట్ కాకుండా అక్షర్ పటేల్ 27, శ్రేయాస్ అయ్యర్ 45, కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేయగా, శుభ్మాన్ గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో బెన్ ద్వార్షిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. విరాట్ కాకుండా కేఎల్ రాహుల్ 42, హార్దిక్ పాండ్యా 28, అక్షర్ పటేల్ 27, శ్రేయాస్ అయ్యర్ 45, కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేయగా, శుభ్మాన్ గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ ను నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో బౌల్డ్ చేయగా, శ్రేయాస్ ను ఆడమ్ జంపా బౌలింగ్ లో బౌల్డ్ చేశాడు. కొన్నోలీ బౌలింగ్‌లో రోహిత్ కూపర్ ఎల్బీగా వెనుదిరిగాడు.