📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Covid-19 in India: దేశంలో గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృ‌తి

Author Icon By Sudha
Updated: June 4, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో. ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. చాప కింద నీరులా దేశంలో కరోనా వ్యాపిస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలో కూడా కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

Covid-19 in India: దేశంలో గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృ‌తి

పెరుగుతున్న కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు
కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని.. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగాయి.. గడిచిన 24 గంటల్లో 276 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృతి చెందారు.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,302 కు పెరిగింది..
ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. అయితే, 3281 మంది రోగులు కూడా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లో ఒక్కో మరణం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 44 మంది కోవిడ్‌తో మృతి చెందారు.
కేరళలో అత్యధికంగా 1373 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 510, ఢిల్లీలో 457, గుజరాత్ 461, పశ్చిమ బెంగాల్ 432, కర్ణాటక 324 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఏపీలో 31, తెలంగాణలో 3 యాక్టీవ్ కేసులున్నాయి.. ఏపీలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ మైల్డ్‌ వేరియంట్‌ అని, ప్రజల్లో హార్డ్‌ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు సాధారణంగా జలుబు, గొంతు నొప్పి, తక్కువ జ్వరం వంటి ఫ్లూ లాంటి లక్షణాలతో ఉంటున్నాయి. ఈ లక్షణాలు సాధారణంగా గమనించబడతాయి, కానీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు . తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు .

Read Also : Rishi Sunak: కన్నడలో నా భార్యకి ప్రపోజ్ చేశాను: బ్రిటిష్ మాజీ ప్రధాని

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu of coronavirus Paper Telugu News Seven people have died Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.