CEC జ్ఞానేశ్ కుమార్ కు భద్రత పెంపు

Follow Us: Google News Daily Hunt
Tamil Nadu Assembly elections to be held in a single phase!: CEC Gyanesh Kumar
Tamil Nadu Assembly elections to be held in a single phase!: CEC Gyanesh Kumar
FONT SIZE
GET APP

CEC Gyanesh Kumar : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇటీవల ఢిల్లీలోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద ప్రతిపక్షాలు, ఇతర వర్గాల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవడంతో భద్రతాధికారులు ఆయన సెక్యూరిటీని సమీక్షించారు. జ్ఞానేశ్ కుమార్‌కు ఇప్పటికే Z+ కేటగిరీ భద్రత అమల్లో ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

Read Also : ముడి చమురు ధరలు కుప్పకూలబోతున్నాయంటూ ట్రంప్ సంచలన ప్రకటన

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రధాన కార్యాలయం వద్ద కూడా భద్రతను విపరీతంగా పెంచారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ర్యాలి ప్రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) మరియు ఢిల్లీ పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర నిరసనలు, ఆందోళనల దృష్ట్యా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన ఛత్తీస్‌గఢ్ పర్యటనను సైతం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయాలపై రాజకీయ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్రం ఈ భద్రతా చర్యలను తీవ్రంగా పరిగణిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు