Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

Read Time:  1 min
Uttar Pradesh Bus Accident:
Uttar Pradesh Bus Accident:
FONT SIZE
GET APP

Uttar Pradesh Bus Accident: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో స్కూల్ మేనేజ్‌మెంట్ బాధ్యతారాహిత్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కనీస ఫిట్‌నెస్ లేని బస్సును నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా ఫ్లోర్ విరిగిపోవడంతో ఏడేళ్ల బాలిక కింద పడిపోయింది. ఆ సమయంలో బస్సు వెనుక చక్రాలు ఆమెపై నుంచి వెళ్లడంతో విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది.

Read also: National ScienceDay: శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Uttar Pradesh Bus Accident

Uttar Pradesh Bus Accident:ఫిట్‌నెస్ లేని వాహనాలే మృత్యుపాశాలు

ప్రమాదానికి గురైన బస్సు చాలా పాతది కావడమే కాకుండా, దాని నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బస్సు లోపల ఉండాల్సిన ఫ్లోర్ బోర్డులు తుప్పు పట్టి బలహీనంగా మారడం వల్ల ఈ విపత్తు సంభవించింది. విద్యాసంస్థలు లాభాల కోసం విద్యార్థుల భద్రతను విస్మరిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి తుప్పు పట్టిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం అధికారుల వైఫల్యమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఈ హృదయ విద్యాక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యంపై మరియు సంబంధిత అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి స్కూల్ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని రవాణా శాఖను డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరణాలు సంభవించకుండా పటిష్టమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.