📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Bengaluru : కన్నడ భాష లో మాట్లాడేందుకు నిరాకరించిన ఎస్ బిఐ మేనేజర్..బదిలీ వేటు

Author Icon By Anusha
Updated: May 21, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న సూర్యనగర ఎస్‌బీఐ శాఖలో చోటుచేసుకున్న భాషా వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ మేనేజ‌ర్ క‌న్న‌డ భాష‌లో మాట్లాడేందుకు నిరాక‌రించింది.ఓ కస్టమర్ ఆ బ్రాంచ్ మేనేజర్‌ను కన్నడలో మాట్లాడాలని కోరగా ఆమె అందుకు అంగీకరించలేదు. తాను కన్నడలో కానీ హిందీలో కానీ అస్సలే మాట్లాడనని చెబుతూ కేవలం ఇంగ్లీషులోనే సమాధానం ఇచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్య గొడవ జరగ్గా ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీంతో అనేక మంది మేనేజర్‌(Manager)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌బీఐ సదరు మేనేజర్‌ను బదిలీ చేసింది.

కస్టమర్‌

బెంగళూరులోని సూర్యనగరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్‌తో గొడవ పడ్డారు.ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ వ్యాఖ్యానించింది. ఇది కర్ణాటక కాబట్టి కన్నడనే మాట్లాడాలని కస్టమర్ చెప్పగా ఇది ఇండియా నాకు నచ్చిన భాషలో మాట్లాడతానంటూ మేనేజర్ దురుసుగా సమాధానం చెప్పారు. ఇలా వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం సాగగా అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియా(Social media)లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా సదరు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు, కస్టమర్‌తో మాట్లాడిన విధానం చూసి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భాషా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కన్నడ భాషపై బ్యాంక్ మేనేజర్ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు కర్ణాటక రక్షణ వేదికే సంఘం ప్రకటించింది. ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లను పదే పేద అవమానిస్తున్నారని స్థానిక భాషలోనే ప్రాథమిక సేవలను అందించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించింది.

అధికారులు

అయితే తాజాగా ఈ వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందించారు.బ్యాంక్ మేనేజర్ పౌరులతో ప్రవర్తించిన తీరు సైరనది కాదని చెప్పారు. అలాగే స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులు అందరూ గౌరవించాలని కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే సూర్య నగరలో కన్నడ మాట్లాడడానికి నిరాకరించిన ఎస్‌బీఐ మేనేజర్‌ను ఆ సంస్థ బదిలీ చేసిందని తెలిపారు. ఇంతటితో ఈ సమస్య సర్దుమణిగిందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటివి జరిగితే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.

Read Also: Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు

#BengaluruNews #Kannada #LanguageControversy #SBI Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.